మే 13 న పాలిసెట్.. ఆన్‌లైన్ దరఖాస్తులు షురూ 

మే 13 న పాలిసెట్.. ఆన్‌లైన్ దరఖాస్తులు షురూ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పాలిటెక్నిక్ కాలేజీల్లోని వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ‘పాలిసెట్–2026’ పరీక్షను మే13న నిర్వహించనున్నట్టు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం ఎస్​బీటెట్ సెక్రటరీ ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఈ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ఇంజనీరింగ్, నాన్-ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటు పీజేటీఎస్‌యూ, పీవీఎన్‌ఆర్‌టీవీయూ వర్సిటీల పరిధిలోని అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ, ఫిషరీస్ కోర్సుల్లో సీట్లను భర్తీ చేయనున్నారు.  పాలిసెట్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సోమవారం నుంచే ప్రారంభమైంది.

టెన్త్ పాసైన స్టూడెంట్లు, ఈ ఏడాది పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు అర్హులని అధికారులు తెలిపారు. ఎలాంటి ఫైన్ లేకుండా ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఏప్రిల్ 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎగ్జామ్ ఫీజు కింద ఎస్సీ, ఎస్టీలు రూ. 250, మిగతా వారు రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ గడువు దాటితే.. రూ.100 లేట్ ఫీజుతో ఏప్రిల్ 21 వరకు, రూ. 300 తత్కాల్ ఫీజుతో ఏప్రిల్ 22 వరకు అప్లై చేసుకునే అవకాశం కల్పించారు.

మరిన్ని వివరాలకు www.polycet.sbtet.telangana.gov.in వెబ్‌సైట్‌ను చూడాలని, ఏమైనా సందేహాలుంటే 08031404549 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు. కాగా..పాలిసెట్ నోటిఫికేషన్ రిలీజ్ లో గందరగోళం నెలకొన్నది. తొలిరోజే వెబ్ సైట్ రాత్రి వరకూ మొరాయించింది. ఓపెన్ కాకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. మరోపక్క ఎస్​బీటెట్ అధికారుల నిర్లక్ష్యంతో అధికారికంగా నోటిఫికేషన్ రిలీజ్ చేయలేకపోయారు. అప్లికేషన్లు ప్రారంభమైన రోజే.. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైనట్టు అధికారులు నోట్ రిలీజ్ చేయడం గమనార్హం.