జూబ్లీహిల్స్, వెలుగు: బంజారాహిల్స్ లో సోమవారం ఓ కారు బీభత్సం సృష్టించింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్–14 జంక్షన్ నుంచి 14/3 రోడ్డులో అమిత్ అనే వ్యాపారవేత్త తన కారులో ఇంటికి బయలుదేరాడు. ఆశా హాస్పిటల్ దాటిన తర్వాత మూలమలుపు వద్ద రోడ్డు సన్నగా ఉండటంతో అధిక వేగంతో అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టాడు. స్థానికులు వెంటనే కారు డోర్లను తెరిచి అందులో ఉన్న అమిత్‌ను బయటకు లాగారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు పరిశీలించగా, నిందితుడికి పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయనపై కేసు నమోదు చేసి దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.
