గుడ్ న్యూస్.. వరసగా మూడు రోజులు సెలవులు.. ఎప్పుడంటే ?

గుడ్ న్యూస్..  వరసగా మూడు రోజులు సెలవులు.. ఎప్పుడంటే ?

విద్యార్థులకు, ఉద్యోగులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. దసరా సెలవుల తర్వాత మరోసారి లాంగ్ వీకెండ్ వచ్చింది. దీపావళి సందర్భంగా వచ్చిన లాంగ్ వీకెండ్ హైదరాబాదీలకు ఓ చిన్న ట్రిప్ వేసుకునే వెసులుబాటు కల్పించిందనే చెప్పాలి.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో అక్టోబర్ 18 నుంచి 20వ తేదీ వరకు వరుసగా మూడు రోజులు సెలవులు ఉన్నాయి. అక్టోబర్ 18 (శనివారం) ధన త్రయోదశి సందర్భంగా సెలవు ఉండగా.. ఆ తర్వాత అక్టోబర్ 19 ఆదివారం కావడంతో, విద్యార్థులు, ఉద్యోగులు మూడు రోజుల పండుగ సెలవులను ఆస్వాదించవచ్చు. 

దీపావళి సందర్భంగా ఈ మూడు రోజుల సెలవులు:

18 - శనివారం
19 - ఆదివారం
20-  సోమవారం( దీపావళి)

దీపావళి పండుగను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ లో కొన్ని ప్రైవేటు సంస్థలు, కంపెనీలు ప్రత్యేకంగా అక్టోబర్ 21న కూడా సెలవు ప్రకటించే అవకాశం ఉందని కంపెనీల ఉద్యోగులు భావిస్తున్నారు. అధికారికంగా ప్రకటించనప్పటికీ.. అప్పటి వరకు తమ కంపెనీలు సెలవు ఇస్తాయని అంటున్నారు. ఏదేమైనా.. విద్యార్థులకు, ఉద్యోగులకు లాంగ్ వీకెండ్ దొరికింది. హైదరాబాద్ నుంచి స్వగ్రామాలకు వెళ్లే వారికి కూడా ఇది కలిసొచ్చే అంశం.