సినిమా లెవెల్లో పక్కా ప్లాన్ వేసి స్కెచ్.. ఇటలీలో సెకన్లనే భారీ దోపిడీ.. పోలీస్ డ్రెస్సుల్లో వచ్చి దొరికిపోయారు..

సినిమా లెవెల్లో పక్కా ప్లాన్ వేసి స్కెచ్.. ఇటలీలో సెకన్లనే భారీ దోపిడీ.. పోలీస్ డ్రెస్సుల్లో వచ్చి దొరికిపోయారు..

స్పానిష్ క్రైమ్ డ్రామా మనీ హీస్ట్ మీకు గుర్తుండే ఉంటుంది, ఎందుకంటే 1969 నాటి ఐకానిక్ మూవీ 'ది ఇటాలియన్ జాబ్'ను గుర్తుచేసే సీన్స్  ఇందులో ఉన్నాయి. అయితే సినిమాల్లో చూసే చేసింగ్ సీన్లలాగే ఇటలీలోని పుగ్లియాలో ఒక భారీ దోపిడీ జరిగింది. దొంగలు పక్కా ప్లాన్‌తో వచ్చి, డబ్బు తీసుకెళ్తున్న వాహనాన్ని దోచుకెళ్లారు. చివరికి పోలీసులు వారిని  వెంటాడి పట్టుకున్నారు. 

ఏం జరిగిందంటే: 
సోమవారం తెల్లవారుజామున ఆరుగురు  దొంగలు ముసుగు వేసుకొని గన్స్ తో హైవేపై ఒక ట్రక్కును ఆపారు. అందులో కొందరు దొంగలు పోలీసుల డ్రెస్సు వేసుకుని వచ్చారు. ట్రక్కును ఆపిన తర్వాత దొంగలు బాంబులతో దాన్ని పేల్చేశారు. ఆ పేలుడు ధాటికి ట్రక్కు పైకప్పు, తలుపులు ఎగిరిపోయాయి. ఆ తర్వాత లోపల ఉన్న డబ్బు వాళ్ళ కారులోకి మార్చుకున్నారు. దొంగలు వాడిన కార్లపై పోలీసు వాహనాలలాగే లైట్లు ఉండటంతో, అసలైన పోలీసులే వచ్చి ఈ పని చేశారని అధికారులు అనుమానిస్తున్నారు.

దొంగతనం చేసిన తర్వాత పారిపోతున్న దొంగలను పోలీసులు వెంటనే ఛేజ్ చేసారు. ఆ సమయంలో దొంగలు పోలీసుల పై  కాల్పులు కూడా జరిపారు. పోలీసుల కారు అద్దానికి బుల్లెట్ తగిలిన.. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఈ దాడిలో పోలీసుల దుస్తుల్లో ఉన్న ఇద్దరు దొంగలను పట్టుకోగా, మిగిలిన వారి కోసం వెతుకుతున్నారు. 

ఈ దోపిడీ మొదటిసారి ఎం కాదు:
ఇటలీలో ఇలాంటి దాడులు జరగడంలో పుగ్లియా ప్రదేశం రెండో స్థానంలో ఉంది. గత నాలుగేళ్లలో అంటే 2019 నుండి 2023 మధ్య    ఇలాంటి దోపిడీల వల్ల దాదాపు 17 వేల కోట్లు దోచుకెళ్లారని రికార్డులు చెబుతున్నాయి. ఈ ఏడాది మొదట్లో కూడా ఇదే ఏరియాలో దాదాపు 32 కోట్ల దోపిడీకి ప్రయత్నం జరిగింది. దొంగలు చాలా తెలివిగా, పక్కాగా స్కెచ్ వేసి ఈ దోపిడీకి పాల్పడ్డారు. దీనిని చూసిన జనం మాత్రం  మనీ హీస్ట్ లేదా ది ఇటాలియన్ జాబ్ సినిమా సీన్స్ గుర్తు చేసాయి అనుకుంటున్నారు.