షాడ్లీ వాన్ షాల్క్‌విక్.. అదరగొడుతున్న USA బౌలర్.. ఒకే ఓవర్లో పాక్ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు !

షాడ్లీ వాన్ షాల్క్‌విక్.. అదరగొడుతున్న USA బౌలర్.. ఒకే ఓవర్లో పాక్ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు !

USA బౌలర్ షాడ్లీ వాన్ షాల్క్‌విక్ పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లోనూ అదరగొట్టాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి అప్పటి దాకా దూకుడుగా ఆడుతున్న పాక్ను దెబ్బ కొట్టాడు. రెండు సిక్సులు, ఒక ఫోర్ కొట్టి స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్న సయీమ్ అయూబ్ వికెట్ తీశాడు. అదే ఓవర్లో పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా వికెట్ కూడా తీసి పాక్కు చుక్కలు చూపించాడు. ఈ రెండు వికెట్లు తీసిన సమయానికి షాల్క్‌విక్ 2 ఓవర్లు బౌలింగ్ చేసి 8 పరుగులు మాత్రమే ఇచ్చాడు. టీమిండియాను బెంబేలెత్తించిన బౌలర్ కూడా షాల్క్‌విక్ కావడం గమనార్హం.

సౌతాఫ్రికా సంతతికి చెందిన అమెరికా బౌలర్ షాడ్లీ వాన్ షాల్క్‌‌‌‌‌‌‌‌విక్ అద్భుత స్పెల్‌‌‌‌‌‌‌‌తో ఇండియా బ్యాటింగ్ నడ్డి విరిచాడు. ఆరో ఓవర్లో ఏకంగా మూడు వికెట్లు పడగొట్టి ఇండియాకు షాకిచ్చాడు. రెండో బాల్‌‌‌‌‌‌‌‌కు ఇషాన్ అనవసర షాట్‌‌‌‌‌‌‌‌కు ప్రయత్నించి ఔటయ్యాడు.  ఓ షాట్‌‌‌‌‌‌‌‌ పిచ్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌తో  తిలక్‌‌‌‌‌‌‌‌ను బోల్తా కొట్టించిన  షాడ్లీ వాన్‌‌‌‌‌‌‌‌ తర్వాతి బాల్‌‌‌‌‌‌‌‌కే  స్లో బౌన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మరో హిట్టర్ శివం దూబే (0)ను డకౌట్ చేశాడు. దాంతో పవర్ ప్లేను ఇండియా 46/4తో ముగించింది.

పేరున్న హిట్టర్లంతా తడబడిన వేళ  కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్  ముందుండి నడిపించడంతో టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌లో ఇండియా శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. గ్రూప్‌‌‌‌‌‌‌‌–ఎ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో టీమిండియా 29  రన్స్ తేడాతో అమెరికాను ఓడించింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు వచ్చిన ఇండియా 20 ఓవర్లలో 161/9 స్కోరు చేసింది. కెప్టెన్ సూర్య (84 నాటౌట్)కు తోడు తిలక్ వర్మ (25), ఇషాన్ కిషన్ (20) ఫర్వాలేదనిపించారు. అమెరికా బౌలర్లలో షాడ్లీ వాన్ షాల్క్‌‌‌‌‌‌‌‌విక్ (4/25) సత్తా చాటాడు. ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో యూఎస్ టీమ్ 20 ఓవర్లలో 132/8 స్కోరు చేసి ఓడింది.