చనిపోయినట్లు చితి వరకు నటించాడు.. జనం రియాక్షన్ చూద్దామని పెద్ద డ్రామా..!

చనిపోయినట్లు చితి వరకు నటించాడు.. జనం రియాక్షన్ చూద్దామని పెద్ద డ్రామా..!

అతనో  రిటైర్డ్​IAF ఆఫీసర్​.. సామాజిక సేవాకార్యకర్త..తన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు.. ఎంతమంది తనను గుర్తుంచుకుంటారు.. తాను కనిపించకపోతే వాళ్లు ఎలా ఫీలవుతారు.. ఎంతమంది ఏడుస్తారు.. ఎంతమంది ఆ..పోయాడులే ఏముంది అనుకుంటారు.. ఇలా అనేక ప్రశ్నలకు సమాధానం రాబట్టుకోవాలనుకున్నాడు..దీనికోసం అతను చేసింది సాహసమనాలో.. వెర్రి అనాలో తెలియదు గానీ .. అతను చేసిన పని సోషల్​మీడియాలో బాగా వైరల్​ అయిపోయింది. ఆ వివరాల్లోకి వెళితే..

మోహన్ లాల్.. బీహార్​ కు చెందిన  74 యేళ్ల రిటైర్డ్ IAF ఆఫీసర్.. గయాలో నివాసి.. పేరున్న సామాజిక కార్యకర్త..సామాజిక సేవలో భాగంగా ప్రజలకు చాలా సేవ చేశాడు. మంచి పేరుంది. అయితే మోహన్​ లాల్​ కు వింత కోరిక పుట్టింది. ఇంత సేవ చేశాను కదా.. తనను ఎవరు గుర్తుంచుకుంటారో,చివరిసారిగా చూడటానికి ఎవరు వస్తారో.. తన గురించి ఏమనుకుంటారో తెలుసుకోవాలని ఓ డ్రమాటిక్​ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నాడు.

మోహన్​ లాల్​ స్వయంగా తన అంత్యక్రియలను తానే ఏర్పాటు చేసుకున్నాడు. తానే  ఊరేగింపుకు నిర్వహించుకున్నాడు.ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే చివరి నిమిషంలో వెళ్లి తన చితికి తానే నివాళుర్పించుకున్నాడు. ఈ  డ్రమాటిక్​ ఇన్సిడెంట్​..గయా చుట్టు పక్కల గ్రామాలతోపాటు సోషల్​ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. 

మోహన్ లాల్ ఊరేగింపు బాణసంచా కాల్చడం, డప్పుల వాయిద్యాలతో  గ్రాండ్ ముగింపు వేడుకలతో ముందుకు సాగింది. పూలతో అలంకరించబడిన శవం గా పాడెపై పడుకొని చితికి చేరుకున్నాడు. ఆ తర్వాత డమ్మి విగ్రహాన్ని చితిపై పెట్టి దహనం చేసి హాజరైన వారికి విందు ఏర్పాటు చేశారు.

ఈ అసాధారణ సంఘటన వెనుక ఒక లోతైన సందేశం ఉంది. మోహన్ లాల్ ఒక రిటైర్డ్ సైనికుడు మాత్రమే కాదు..సామాజిక సేవలో కూడా చురుగ్గా ఉన్నాడు. వర్షాకాలంలో అంత్యక్రియలకు వచ్చే ఇబ్బందులను తొలగించడానికి ఆయన తన గ్రామంలోనే ముక్తిధామ్ (స్మశానవాటిక) కూడా నిర్మించారు.

తాను ఏర్పాటు చేసుకున్న ఈ వింత కార్యక్రమంపై  మోహన్​ లాల్​ ఓ క్లారిటీ కూడా ఇచ్చారు. మరణించిన తర్వాత కన్నీళ్లు పెట్టుకోవడం కంటే జీవించి ఉన్న వ్యక్తి పట్ల అనుబంధం, గౌరవం విలువైనవని ప్రజలు భావించేలా చేయడమే తన ఉద్దేశమని మోహన్ లాల్ చెప్పారు. ఎంతైన సామాజిక కార్యకర్త కదా.