బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ లీడ్ రోల్‌లో నటిస్తున్న కొత్త సూపర్ హీరో చిత్రం ‘ది గ్రేట్ గ్రాండ్ సూపర్ హీరో - ఏలియన్స్ కా ఆగమన్’. మనీష్ సైనీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను జీ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తోంది. మంగళవారం ఈ మూవీ అనౌన్స్‌మెంట్‌తో స్పెషల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు ఈ వీడియో ద్వారా రివీల్ చేశారు. స్కూల్‌లో ఓ స్టూడెంట్ తన ఫ్యామిలీ సీక్రెట్ గురించి ఫ్రెండ్‌కు చెప్పడంతో ప్రారంభమైన గ్లింప్స్ ఆకట్టుకుంది.
తన తాతయ్యకు సూపర్ పవర్స్ ఉన్నాయని, ఒకవేళ ఆ విషయం బయటపడితే తాతయ్య శక్తులు కోల్పోవడమే కాకుండా, భూమిపై ఏలియన్స్ దాడి చేసే అవకాశం ఉందని చెబుతాడు. ఫైనల్‌గా జాకీ ష్రాఫ్ సూపర్ హీరోగా కనిపించి ఆశ్చర్యపరిచాడు.
1985లో ‘శివ కా ఇన్సాఫ్’లో సూపర్ హీరోగా నటించిన జాకీ ష్రాఫ్ దాదాపు 40 ఏళ్ల తర్వాత మళ్లీ అలాంటి పాత్రలో కనిపించనుండటం హైలైట్‌గా నిలిచింది. ఆయనతో పాటు ప్రతీక్ బబ్బర్, భాగ్యశ్రీ, శరత్ సక్సేనా, సాహర్ష్ శుక్లా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సమ్మర్‌లో సినిమా విడుదల కానుంది.
