గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు నందాదేవి LPG ట్యాంకర్ .. హార్మూజ్ దాటొచ్చిన రెండో ఎల్పీజీ నౌక

గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు నందాదేవి LPG ట్యాంకర్ .. హార్మూజ్ దాటొచ్చిన రెండో ఎల్పీజీ నౌక

అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎల్పీజీ సరఫరాలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ‘నందాదేవి’ అనే ఎల్పీజీ ట్యాంకర్ మంగళవారం గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని వడినార్ పోర్టుకు చేరుకుంది. ఈ నౌకలో 47వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ ఉంది. ఇది హార్మూజ్ జలసంధి దాటి భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరిన రెండో ఎల్పీజీ నౌక. అంతకు ముందు సోమవారం శివాలిక్ ట్యాంకర్ ముంద్రా పోర్టుకు చేరుకుంది.

ఆ నౌకలో 46వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ ఉండగా, అది 32.4 లక్షల గృహ సిలిండర్లకు సమానమని అధికారులు తెలిపారు. ఈ ఒక్క నౌకతో దేశం ఒకరోజు ఎల్పీజీ దిగుమతి అవసరాన్ని తీర్చగలదని అంచనా వేశారు. నందాదేవి నుంచి సుమారు 24 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీని  తమిళనాడుకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ రెండు నౌకల రాకతో దేశంలో ఎల్పీజీ సరఫరా కొంతవరకు స్థిరపడే అవకాశం కనిపిస్తున్నది. ఇటీవల అనేక సిటీల్లో గ్యాస్ కొరతతో క్యూలు పెరిగాయి. హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న దుకాణాలు మూతపడే పరిస్థితి వస్తుందని భయం నెలకొన్నది.