హైదరాబాద్, వెలుగు: కెన్‌స్టార్ ఫైవ్‌స్టార్ బీ రేటింగ్ గల ఎయిర్ కూలర్లను విడుదల చేసింది. వీటికి ఐదేళ్ల వారంటీ ఇస్తోంది. ఇవి కరెంటు వాడకాన్ని తగ్గిస్తూ మెరుగైన పనితీరు అందిస్తాయని సంస్థ తెలిపింది.
నటుడు రాజ్‌కుమార్ రావు, నటి పత్రలేఖను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకున్నామని తెలిపింది. కరెంటు బిల్లును తగ్గించడానికి బీఎల్డీసీ మ్యాక్స్ టెక్నాలజీ, మెరుగైన గాలి ప్రసరణకు క్వాడ్రా ఫ్లో టెక్నాలజీ, ఎక్కువ చల్లదనాన్ని అందించడానికి హైడ్రో డెన్స్ మెష్ హనీకాంబ్ కూలింగ్ ప్యాడ్లు ఉన్నాయని కెన్‌స్టార్ తెలిపింది.
