
ఇటీవల కాలంలో హైదరాబాద్ లో డ్రగ్స్ వాడకం, రేవ్ పార్టీల కల్చర్ పెరిగిపోతోంది. రేవ్ పార్టీలు చట్టానికి విరుద్ధమని ప్రభుత్వం, పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ పెద్దగా మార్పు రావడంలేదు. ముఖ్యంగా సిటీ శివారు ప్రాంతాల్లోని రిసార్ట్స్, ఫామ్ హౌస్ లు రేవ్ పార్టీలకు అడ్డాగా మారుతున్నాయి.. హైదరాబాద్ మహేశ్వరంలో రేవ్ పార్టీ భగ్నం చేశారు పోలీసులు. మంగళవారం ( అక్టోబర్ 14 ) మహేశ్వరంలోని కే చంద్రారెడ్డి రిసార్ట్స్ పై దాడి చేసిన పోలీసులు రేవ్ పార్టీని భగ్నం చేశారు.
ఏపీకి చెందిన ఫర్టిలైజర్ కంపెనీ డీలర్లకు మందు, అమ్మాయిలతో పార్టీ ప్లాన్ చేయగా.. రాచకొండ ఎస్ఓటీ పోలీసులు భగ్నం చేశారు. పార్టీలో లిక్కర్ కోసం పోలీసుల అనుమతి తీసుకున్న కంపెనీ యజమాని అమ్మాయిలను డ్యాన్సర్లను కూడా అరెంజ్ చేశాడు.
డైల్ 100 కు వచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగారు ఎస్ఓటీ పోలీసులు. రేవ్ పార్టీపై సమాచారం అందుకున్న పోలీసులు ఆకస్మిక దాడి చేసి పార్టీలోని లిక్కర్ తో పాటు అమ్మాయిలను కూడా అదుపులోకి తీసుకున్నారు. పార్టీలో లిక్కర్ కు అనుమతి ఉన్నప్పటికీ అమ్మాయిలు, డ్యాన్సర్లను అరెంజ్ చేయడం చట్ట విరుద్ధమని తెలిపారు పోలీసులు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రేవ్ పార్టీలు చట్ట విరుద్ధమని..ఇలాంటి పార్టీలకు రిసార్ట్స్ రెంట్ ఇవ్వద్దని రిసార్ట్స్ నిర్వాహకులకు సూచించారు పోలీసులు.