
ఐపీఎల్ 2026 మినీ వేలంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. డిసెంబర్ 13 లేదా 14న ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ జరగనుంది. ఇప్పటి నుంచే ప్రాంఛైజీలు తమ ప్లేయర్ల రిటెన్షన్, రిలీజ్ జాబితాలపై ఫోకస్ పెట్టాయి. 10 ఫ్రాంచైజీలు ఆటగాళ్ల రిటైన్ పై ఒక ఒక అంచనాకు వచ్చాయి. డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టోర్నీ అంతటా అద్భుతంగా ఆడి 18 ఏళ్ళ ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ట్రోఫీ గెలుచుకుంది. 2026 ఐపీఎల్ మినీ వేలానికి ముందు జట్టును మరింత పటిష్టం చేసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా రిటైన్ చేసుకునే ఆటగాళ్లు.. రిలీజ్ చేసే ఆటగాళ్లు.. టార్గెట్ చేసే ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..
లివింగ్ స్టోన్, తుషారా, రసిఖ్ సలాం దార్ లకు గుడ్ బై:
2025 ఐపీఎల్ మెగా ఆక్షన్ లో భారీ ధరకు కొనుగోలు చేసిన లియామ్ లివింగ్‌స్టోన్, రసిఖ్ సలాం దార్ లను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రిలీజ్ చేసే అవకాశం ఉంది. లివింగ్‌స్టోన్‌ను రూ.8.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసినా ఘోరంగా విఫలమయ్యాడు. 10 మ్యాచ్‌ల్లో కేవలం 112 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. బౌలింగ్ లోనూ పెద్దగా రాణించింది లేదు. దీంతో ఈ ఇంగ్లాండ్ ఆల్ పవర్ హిట్టర్ ను రిలీజ్ చేసే ఆలోచనలో ఆర్సీబీ ఉన్నట్టు సమాచారం. రూ. 6 కోట్లు ఖర్చు రసిఖ్ సలాం దార్ రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఈ జమ్మూ కాశ్మీర్ ఆల్ రౌండర్ అవసరం లేదన్నట్టు ఆర్సీబీ యాజమాన్యం భావిస్తోంది. శ్రీలంక యార్కర్ల వీరుడు నువాన్ తుషారతోపాటు టిమ్ సీఫెర్ట్, బ్లెస్సింగ్ ముజారబానీని సైతం రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి.
కెమరూన్ గ్రీన్ పై బెంగళూరు కన్ను:
ఐపీఎల్ 2026 మినీ వేలంలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కన్నేసింధీ. నిఖార్సైన ఈ ఆసీస్ ఆల్ రౌండర్ తమ జట్టులో ఉంటే తిరుగుండదని భావిస్తోంది. గ్రీన్ గతంలో ఆర్సీబీ జట్టుకు ఆడి అద్భుతంగా రాణించాడు. గత సేయీజాన్ లో గాయం కారణంగా ఐపీఎల్ సీజన్ ఆడలేదు. ఈ ఏడాది జరగబోయే ఐపీఎల్ 2026 మినీ వేలంలో అత్యధిక ధర పలికే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
గ్రీన్ బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ చేయగలడు. ఇలాంటి ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ జట్టులో ఉంటే ఏ జట్టు అయినా పటిష్టంగా మారుతుంది. ఈ ఆజానుభావుడుపై బెంగళూర్ తో పాటు చాలా ఐపీఎల్ జట్లు కన్నేసినట్టు సమాచారం. గాయంతో 2025 ఐపీఎల్ కు దూరమైనా గ్రీన్ మళ్ళీ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. తన రీ ఎంట్రీలోనే ఈ ఆసీస్ ఆల్ రౌండర్ టాప్ ఫామ్ తో చెలరేగుతున్నాడు. వెస్టిండీస్ పై ఇటీవలే ముగిసిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో బ్యాటింగ్ లో గ్రీన్ దంచికొట్టాడు. వరుసగా 51, 56*, 11, 55*, 32 స్కోర్లు చేసి సత్తా చాటాడు. అంతేకాదు ఆదివారం (ఆగస్టు 10) సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో 13 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 35 పరుగులు చేశాడు.