ఇండియా ఖాతాలోకి ఐసీసీ ప్రైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మనీ రూ.25 కోట్లు

ఇండియా ఖాతాలోకి ఐసీసీ ప్రైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మనీ రూ.25 కోట్లు

దుబాయ్: సొంతగడ్డపై టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచిన టీమిండియా ఐసీసీ నుంచి  సుమారు రూ.25 కోట్లు (26.39 లక్షల డాలర్లు) ప్రైజ్ మనీ అందుకుంది. టోర్నీకి కేటాయించిన మొత్తం 11.25 మిలియన్ డాలర్ల ( రూ. 94.40 కోట్లు) రికార్డు స్థాయి ప్రైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మనీలో ఇండియాకు అతిపెద్ద వాటా దక్కింది. రన్నరప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సుమారు రూ. 13 కోట్లు (14.22 లక్షల డాలర్లు) అందాయి. 

సెమీఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  చేరుకున్న సౌతా ఫ్రికాకు రూ. 9.24 కోట్లు, ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ. 8.96 కోట్ల నగదు లభించింది.  తమ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లన్నీ లంకలో ఆడిన పాకిస్తాన్ జట్టుకు రూ.4.47 కోట్లు, శ్రీలంకకు రూ.4.07 కోట్లు లభించాయి. సూపర్– 8 దశలో నిష్క్రమించిన ఆస్ట్రేలియా, అఫ్గానిస్తాన్, అమెరికా జట్లకు తలో రూ. 2.65 కోట్లు అందాయి. ఇటలీ, నెదర్లాండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, యూఏఈ, నేపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తలో రూ. 2.6 కోట్లు,   కెనడా, నమీబియా, ఒమన్ జట్లకు  రూ. 1.92 కోట్ల చొప్పున కేటాయించారు.