దుబాయ్: టీ20 వరల్డ్ కప్‌లో దుమ్మురేపిన ఇషాన్ కిషన్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ అదరగొట్టాడు. బుధవారం విడుదల చేసిన తాజా ర్యాకింగ్స్‌లో ఇషాన్ 4 నుంచి కెరీర్ బెస్ట్ రెండో ర్యాంక్‌కు దూసుకొచ్చాడు. ప్రస్తుతం అతని ఖాతాలో 871 ర్యాంకింగ్ పాయింట్లు ఉన్నాయి. టోర్నీలో 317 రన్స్ చేయడం ఇషాన్‌కు కలిసొచ్చింది. ఇక వరల్డ్ కప్ ఫైనల్లో న్యూజిలాంపై హాఫ్ సెంచరీ చేసిన స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ (875 పాయింట్లు) టాప్ ర్యాంక్ నిలబెట్టుకున్నాడు.
కివీస్ బ్యాటర్ టిమ్ సిఫర్ట్ నాలుగు ప్లేస్‌లు ఎగబాకి ఆరో ర్యాంక్‌లో నిలిచాడు. తిలక్ వర్మ ఆరు నుంచి ఏడో ప్లేస్‌కు పడిపోయాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (740 పాయింట్లు) టాప్ ప్లేస్ కోల్పోయి రెండో ర్యాంక్‌లో నిలిచాడు. అఫ్గాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ టాప్ ర్యాంక్‌కు దూసుకొచ్చాడు. జస్‌ప్రీత్ బుమ్రా ఒక ప్లేస్ ఎగబాకి ఆరో ర్యాంక్‌ను సాధించాడు. ఆల్‌రౌండర్లలో సికందర్ రజా,హార్దిక్ పాండ్యా టాప్–2లో కొనసాగుతున్నారు.
