Rishab Shetty: బెంగుళూరు నుంచి మకాం మార్చిన రిషబ్ శెట్టి! ఫ్యామిలీని షిఫ్ట్ చేయడానికి కారణం ఇదే!

 Rishab Shetty: బెంగుళూరు నుంచి మకాం మార్చిన రిషబ్ శెట్టి! ఫ్యామిలీని షిఫ్ట్ చేయడానికి కారణం ఇదే!

కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'కాంతార చాప్టర్ 1' .  అక్టోబర్ 2న  ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. సినీ ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుని థియేటర్లలో దూసుకుపోతోంది. ప్రపంచ వ్యా్ప్తంగా ఇప్పటి వరకు రూ. 675 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే ' కాంతార' సిరీస్ తో దేశవ్యాప్తంగా స్టార్ డమ్ ను సొంతం చేసుకున్న రిషబ్ శెట్టి..  తెరపైనే కాదు.. తెర వెనుక తీసుకున్న నిర్ణయంతో అందరిని మనసులను గెలుచుకుంటున్నారు. ఇప్పుడు ఆయన సింపుల్ లైఫ్ గురించి హాట్ టాఫిక్ గా మారింది.

సిటీ లైఫ్ వదిలి సొంతూరికి మకాం..

సాధారణంగా చాలా మంది సినీ ప్రముఖులు నగర జీవితాన్ని ఇష్టపడుతూ.. విలాసాలను ఆస్వాదిస్తుంటారు. కానీ రిషబ్ శెట్టి మాత్రం దానికి విరుద్ధంగా తన గ్రామీణ మూలాలకు చేరువయ్యారు.  గతంలో బెంగళూరు నగర జీవితంలోని గందరగోళం నుంచి బయటపడ్డారు. తన స్వగ్రామమైన కుందాపురానికి మకాం మార్చారు.  గత ఐదేళ్లుగా నేను, నా భార్య ప్రగతి శెట్టి, పిల్లలు రణ్విత్ , రాధ్యతో పాటు, ఈ ప్రాజెక్ట్‌లో భాగమైన నా సన్నిహితులంతా కుందాపురంలోనే నివసిస్తున్నాం అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రిషబ్ శెట్టి తెలిపారు.

కుటుంబంతో సహా షిఫ్టింగ్ ఎందుకంటే?. 

'కాంతార చాప్టర్ 1' నిర్మాణం సుదీర్ఘంగా, డిమాండింగ్‌గా సాగిన సమయంలో కుటుంబానికి దూరంగా ఉండటం కష్టమనిపించిందని రిషబ్ తెలిపారు. ఈ సమయంలో  కీలక నిర్ణయం తీసుకుని..  సినిమా సెట్‌లు నిర్మిస్తున్న తీరప్రాంత గ్రామమైన కుందాపురానికి కుటుంబాన్ని తీసుకొచ్చి, పిల్లలను దగ్గర్లోని స్కూళ్లలో చేర్పించాం అని రిషబ్ వివరించారు. ఈ సినీ ప్రయాణంలో ఆయన భార్య ప్రగతి అందించిన సహకారాన్ని ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నారు. నేను 'కాంతార' ప్రపంచంలో మునిగిపోయి ఉన్నప్పుడు..  ఆమె అన్నింటినీ చూసుకున్నారు అంటూ తన విజయానికి ఆమె అండదండలు ఎంతో ముఖ్యమని క్రెడిట్ ఇచ్చారు రిషబ్..

భవిష్యత్తుపై సందిగ్ధత..

ప్రస్తుతానికి నగర జీవితాన్ని వదిలి, గ్రామీణ వాతావరణంలోని ప్రశాంతతను ఆస్వాదిస్తున్నప్పటికీ, సొంతూరులోనే కొనసాగాలో లేదో ఇంకా నిర్ణయించుకోలేదని రిషబ్ తెలిపారు. పిల్లల విద్యను ఇక్కడే కొనసాగించాలా లేక తిరిగి బెంగుళూరుకు వెళ్లాలా అనే విషయం మార్చి నెలాఖరులోపు నిర్ణయించుకోవాలి అని పేర్కొన్నారు. తెరపైనే కాదు, తెర వెనుక తీసుకున్న నిర్ణయంతోనూ రిషబ్ శెట్టి అభిమానుల మనసులను గెలుచుకుంటున్నారు

►ALSO READ | MeesaalaPilla: ‘మీసాల పిల్ల’ ఫుల్ సాంగ్ వచ్చేసిందోచ్.. కుర్రోళ్ళందరూ తమ పిల్లతో స్టెప్పులేయాల్సిందే!!

ముంబైలో ఒకప్పుడు డ్రైవర్‌గా, ఆఫీస్ బాయ్‌గా పనిచేసిన స్థితి నుంచి నేడు జాతీయ అవార్డు గ్రహీతగా,  సుమారు రూ. 400  కోట్ల చిత్ర సృష్టికర్తగా ఎదగడం ఆయన ప్రయాణంలో స్ఫూర్తిదాయకం. ఈ ప్రయాణాన్ని గురించి సోషల్ మీడియా వేదికగా భావోద్వేగాన్ని  పంచుకున్నారు. "2016లో ఒక సాయంకాలం షో కోసం కష్టపడిన స్థాయి నుండి, 2025లో 5000+ హౌస్‌ఫుల్ షోల వరకు... ఈ ప్రయాణమంతా మీ ప్రేమ, మద్దతు , దేవుడి దయ," అంటూ రిషబ్ తన కృతజ్ఞతను వ్యక్తం చేశారు పోస్ట్ చేశారు. .