
మెగాస్టార్ చిరంజీవి, లేడి సూపర్ స్టార్ నయనతార జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ క్రేజీ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఈ క్రమంలోనే మూవీ ఫస్ట్ సింగిల్ ‘మీసాల పిల్ల’ ప్రోమోతో మరింత క్యూరియాసిటీ కలిగించారు అనిల్.
ఇదే సమయంలోను అక్టోబర్ 13న రిలీజ్ కావాల్సిన ‘మీసాల పిల్ల’ ఫుల్ సాంగ్, సడెన్గా పోస్ట్ఫోన్ చేసి, ఫ్యాన్స్ హార్ట్స్ని ఒక్కసారిగా హోల్డ్ చేసేశారు. దీంతో చాలామంది ఫ్యాన్స్ హార్ట్ అయ్యారు. అయిన్నప్పటికీ.. మంచి డోసేజ్తో ‘మీసాల పిల్ల’ ఫుల్ సాంగ్ తీసుకొచ్చారు అనిల్ అండ్ సాంగ్ కంపోజర్ భీమ్స్!!!
‘మీసాల పిల్ల’ ఫుల్ సాంగ్:
ఇవాళ మంగళవారం (అక్టోబర్ 14న) ‘మీసాల పిల్ల’ ఫుల్ సాంగ్ రిలీజయింది. లోవర్ క్లాస్ నుంచి హై క్లాస్ లవర్స్, భార్యాభర్తలు.. ఇలా అందరూ.. హమ్ చేసుకునే విధంగా సాంగ్ ఆకట్టుకుంటుంది. చిరు, నయనతార కెమిస్ట్రీ భలే ముచ్చటగా ఉంది. భీమ్స్ క్రేజీ ట్యూన్కి, విజయ్ పోలంకి సమకూర్చిన స్టెప్స్ పర్ఫెక్ట్ సెట్ అయ్యాయి. లెజండరీ సింగర్ ఉదిత్ నారాయణ్, శ్వేతా మోహన్ కలిసి.. రొమాంటిక్ మెలోడీతో మంచి ఫీల్ ఇచ్చేలా కలసి పాడారు.
‘‘పొద్దున్న లేచిన దగ్గరనుంచీ డైలీ యుద్ధాలా.. మొగుడు పెల్లాలంటేనే కంకీ కొడవల్లా..అట్టా కన్నెర్ర జేయాలా.. కారాలే నూరేలా.. కుందేలుకి కోపం వస్తే చిరుతకి చెమటలు పట్టేలా’’ అనే భాస్కర భట్ల లిరిక్స్ భలే సరదాగా ఉన్నాయి. ‘నీ వేషాలు చాల్లే.. కాకాపడితే కరిగేటంత సీనే లేదులే.. అందితే జుట్టు.. అందకపోతే కాళ్ళా బేరాలా’ అనే పదాలు సాటి సామాన్య ఆడియన్స్ సైతం పాడుకునేలా ఉన్నాయి.
►ALSO READ | ఓవైపు రష్మిక అందాలు.. మరోవైపు 51 ఏళ్ల మలైకా హాట్ డ్యాన్స్.. షేక్ చేస్తున్న పాయిజన్ బేబీ సాంగ్
చివరగా.. వెంకటేష్ ‘గోదారి గట్టు మీద సాంగ్’ ఎంతటి ఆదరణ సొంతం చేసుకుందో.. మళ్ళీ అలాంటి గ్రిప్ లోనే ‘మీసాల పిల్ల’ సాంగ్ రావడం అభిమానుల్లో ఫ్రెష్ ఫీలింగ్ కలిగిస్తోంది. మొన్నటివరకు ప్రోమోతో సోషల్ మీడియాలో హీట్ పెంచిన అనిల్.. ఇపుడు ఫుల్ సాంగ్తో మరింత వైరల్ అయ్యేలా చేశాడు. ఇక నేటి నుంచి ఊర్లో కుర్రోళ్ళు అందరూ తమ పిల్లని క్యూట్గా.. “మీసాల పిల్ల” అని పిలుస్తూ స్టెప్పులేయడం కన్ఫార్మ్!!
ప్రస్తుతం ఈ మూవీ వరుస షూటింగ్ షెడ్యూల్స్తో బిజీగా ఉంది. ఇందులో చిరంజీవి చాలా కాలం తర్వాత పవర్‌ఫుల్ వింటేజ్ లుక్లో, యంగ్ ఏజ్‌లో కనిపిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే అనిల్ రావిపూడి మార్క్‌తో మాస్ ఎంటర్‌టైన్‌మెంట్కు పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. ఈ మాస్ బ్లాక్‌బస్టర్ మూవీ 2026 సంక్రాంతికి కానుకగా రిలీజ్ కానుంది. ఇన్ని అంచనాలు, ఇంతటి క్రేజీ ప్రమోషన్స్తో వస్తున్న మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి!!