ఓవైపు రష్మిక అందాలు.. మరోవైపు 51 ఏళ్ల మలైకా హాట్ డ్యాన్స్.. షేక్ చేస్తున్న పాయిజన్ బేబీ సాంగ్

ఓవైపు రష్మిక అందాలు.. మరోవైపు 51 ఏళ్ల మలైకా హాట్ డ్యాన్స్.. షేక్ చేస్తున్న పాయిజన్ బేబీ సాంగ్

రష్మిక మందన్న, ఆయుష్మాన్‌‌‌‌ ఖురానా జంటగా నటిస్తున్న హిందీ మూవీ ‘థామా’. ఆదిత్య సర్పోత్దార్ దర్శకుడు. దీపావళికి స్పెషల్గా మంగళవారం (21 అక్టోబర్ 2025న) థియేటర్లలో రీలిజ్ కానుంది. ఈ క్రమంలో ‘థామా’ నుంచి స్పెషల్ అప్డేట్స్ రిలీజ్ చేస్తూ.. ఆడియన్స్లో హైప్ పెంచుతున్నారు. 

లేటెస్ట్గా ‘పాయిజన్ బేబీ’ అనే స్పెషల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సాంగ్లో బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా, రష్మిక మందన్న కలిసి స్పెషల్ స్టెప్పులేశారు. ఇందులో రష్మిక అందాలు, మలైక వంపులు ఆడియన్స్ లో మంట పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా 51 ఏళ్ల మలైకా సూపర్ హాట్ డ్యాన్స్ మూవ్‌లకు ముగ్ధులవుతున్నారు. చాలా కాలం తర్వాత మలైకా అరోరా నుంచి, పూర్తి స్థాయి డ్యాన్స్ నంబర్‌ రావడంతో ఎగబడి రిపీటెడ్గా చూస్తున్నారు.

ఈ క్రమంలోనే ‘పాయిజన్ బేబీ’ సాంగ్ సోషల్ మీడియాలో రచ్చరేపుతోంది. సచిన్-జిగర్ స్వరపరిచిన ఈ సాంగ్ ని జాస్మిన్ సాండ్లాస్, అమితాబ్ భట్టాచార్య సాహిత్యం అందించారు. అయితే, సచిన్-జిగర్ ఇచ్చిన బీట్స్కు తగ్గట్లుగా, లీరిక్స్ పడ్డాయి. అందుకు టాప్ లెవల్ స్టెప్పులతో మలైకా, రష్మిక ఆకట్టుకోవడం.. ఈ సాంగ్ని మరింత హైలెట్ చేసేసింది. సాంగ్ చివర్లో.. కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, డైరెక్టర్ అమర్ కౌశిక్ కూడా మలైకాతో స్టెప్పులేస్తూ వావ్ అనిపించుకున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్, గ్లింప్స్, పోస్టర్స్ థామాపై భారీ అంచనాలు పెంచాయి. మరీ ముఖ్యంగా ఇప్పటివరకు రిలీజైన ప్రమోషన్స్ వీడియోస్ అన్నీ రష్మిక చూట్టే ఉండటం ఆసక్తి కలిగిస్తున్నాయి. రష్మిక క్రేజీ లుక్స్, టీజర్ అండ్ ట్రైలర్లో రొమాంటిక్ సీన్స్ వైబ్ క్రియేట్ చేస్తున్నాయి.

►ALSO READ | Aneet, Ahaan: వైర‌ల్‌గా మారిన రొమాంటిక్ హిట్ పెయిర్‌.. సినిమాలోనే కాదు, బయట కూడా కెమిస్ట్రీ!

ఇటీవలే థామా నుంచి ‘తుమ్ మెరే నా హుయే’ వీడియో సాంగ్ (సెప్టెంబర్ 29న) రిలీజ్ చేశారు. ఇందులో రష్మిక హాట్ మూవ్స్తో కిరాక్ స్టెప్పులు వేసింది. రష్మిక అందాలు, ఆయుష్మాన్తో చేసే రొమాన్స్ సీన్స్.. ఫ్యాన్స్ను రెచ్చగొట్టేలా ఉన్నాయి. ఇపుడు ఈ ‘పాయిజన్ బేబీ’, ‘తుమ్ మెరే నా హుయే’ వీడియో సాంగ్స్ యూట్యూబ్ ట్రెండింగ్లో కొనసాగుతోన్నాయి. తుమ్ మెరే నా కోటి 60 లక్షలకి పైగా వ్యూస్తో దూసుకెళ్తోంది. మరి ఈ క్రేజీ హాట్ సాంగ్స్ చూసేయండి!!!