
‘సయ్యారా’తో మోస్ట్ పాపులార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన యంగ్ బ్యూటీ.. అనీత్ పడ్డా (Aneet Padda). సోమవారం (2025 అక్టోబర్ 13న) అనీత్ తన 23వ పుట్టినరోజును జరుపుకుంది. అయితే, ఈ బర్త్ డే వేడుక సయ్యారా కో- స్టార్ అహాన్ పాండేతో సెలబ్రేట్ చేసుకోవడం విశేషం సంతరించుకుంది. ఈ జోడీ రొమాంటిక్ ఫిల్మ్ 'సయ్యారా'తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి, యూత్లో స్పెషల్ ఇంపార్టెన్స్ సొంతం చేసుకున్నారు.
ఈ సినిమాలో ఆరాధ్య, కిషన్ల పాత్రల్లో రొమాన్స్తో అదరగొట్టారు. ఫస్ట్ సినిమాతోనే బాక్సాఫీస్ను షేక్ చేశారు. వారి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ దేశవ్యాప్తంగా యూత్ హృదయాలను గెలుచుకుంది. దీంతో వీరిద్దరి మధ్య లవ్ ఎఫైర్ నడుస్తుందని రూమర్స్గా వైరల్ అయ్యారు. ఈ క్రమంలోనే బ్యూటీ అనీత్ పడ్డా, హీరో అహాన్ పాండేతో కలిసి ‘తన స్పెషల్ డే’ని జరుపుకోవడంతో.. ఇపుడు రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. ప్రస్తుతం వీరిద్దరు కలిసి ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
వైరల్ అవుతున్న ఒక వీడియోలో అనీత్ పడ్డాకు ఫస్ట్ అహాన్ పాండే కేక్ కట్ చేసి తినిపించడం ఆసక్తిగా మారింది. అలాగే, ఈ జోడీ ఒకే కలర్ బ్లాక్ డ్రస్లో కనిపించి, క్యూట్ ఎక్సప్రెషన్స్తో ఆకట్టుకున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్ల నుంచి బ్యూటిఫుల్ కామెంట్స్ వస్తున్నాయి.
“ఆన్ స్క్రీన్ లానే ఆఫ్-స్క్రీన్ కెమిస్ట్రీ క్రేజీగా ఉంది.. ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది.. అతను ఆమె పట్ల ఎక్కువ ప్రేమతో ఉన్నాడు” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరో నెటిజన్ స్పందిస్తూ.. “చూపు తిప్పుకోవట్లేదు.. కానీ, చివరికి అనీత్ పడ్డా సిగ్గుపడింది.. వీరిమధ్య కెమిస్ట్రీ ఖచ్చితంగా ఉంది” అని అన్నారు. ప్రస్తుతం వీరి ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతుండటంతో.. బ్యూటీ అనిత్కు నెటిజన్లు బర్త్ డే విషెష్ చెబుతున్నారు.
అనీత్ పడ్డా: 'సైయారా' సినిమాతో అనీత్ పడ్డా పాపులర్ అయినప్పటికీ.. 'సలాం వెంకీ' (2022) మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'బిగ్ గర్ల్స్ డోన్ట్ క్రై' (2024) అనే సిరీస్‌లో కీ రోల్ ప్లే చేసింది. ఈ బ్యూటీ పేరెంట్స్ నిత్య మరియు కరణ్, సినిమా నిర్మాణ రంగంలో ఉన్నారు.
‘సయ్యారా’ బాక్సాఫీస్: 'ఆషికి 2', 'ఏక్ విలన్' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు మోహిత్ సూరి. 'సయ్యారా'తో మరోసారి ప్రేమకథా చిత్రాల్లో తనదైన ముద్ర వేశారు. పాతతరం బాలీవుడ్ ప్రేమకథల ఆకర్షణను ఆధునిక భావాలతో మేళవించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా విడుదలైనప్పటి నుంచి, అభిమానులు దీనిని చూసి ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. సుమారు 45 కోట్లతో బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మొత్తం రూ. 397.89 కోట్ల గ్రాస్ ను వసూళ్లు చేసింది. YRF సంస్థకు 649 శాతం మేరకు లాభాలను తెచ్చి పెట్టింది.
‘సయ్యారా’ కథ:
'సయ్యారా' కథ మొత్తం వాణి (అనీత్ పడ్డా) అనే యువతి చుట్టూ తిరుగుతుంది. పెళ్లికి ముందు ఆమె ప్రియుడు ఆమెను వదిలి వెళ్ళిపోవడంతో ఆమె జీవితం తలకిందులవుతుంది. ఈ సంఘటన తర్వాత, ఆమె ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ప్రయత్నిస్తుంది. ఆమెకు ఆరు నెలల తర్వాత కొత్త ఉద్యోగం లభిస్తుంది, అక్కడ ఆమె కిషన్ (అహాన్ పాండే) అనే గాయకుడిని కలుస్తుంది. అతను కూడా తన జీవితంలో సమస్యలతో బాధపడుతుంటాడు. వీళ్లిద్దరు కలిసి సమయం గడుపుతున్న కొద్దీ, ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ బంధాన్ని ఏర్పరచుకుంటారు.