దీపావళి పండుగ సందడి వచ్చేసింది. దింతో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈకామర్స్ కంపెనీలు గొప్ప డిస్కౌంట్స్, ఆఫర్స్ సేల్స్ ప్రవేశపెట్టాయి. ఒకవేళ మీరు ఏదైనా ఈ పండగ సీజన్లో కొనాలనుకుంటే ఇదే మంచి ఛాన్స్... ఎందుకంటే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అతితక్కువ ధరకే షాపింగ్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి.
ఒకవేళ మీ బడ్జెట్ రూ.10 వేల వరకు అయితే, ఏదైనా మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటే ఇదే సరైన సమయం. ఎందుకంటే అతితక్కువ ధరకే మీరు 5G ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఆకట్టుకునే డిస్‌ప్లే, పవర్ ఫుల్ బ్యాటరీ, అద్భుతమైన కెమెరా ఫోన్లు ఇప్పుడు ఊహించని ధరకే లభిస్తున్నాయి. రూ.10వేలలోపు ఉన్న 5 బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్‌లు ఏవంటే...
iQOO Z10 లైట్ 5G: ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్ లో iQOO Z10 Lite 5G చాలా తక్కువ ధరకే లభిస్తుంది. ప్రస్తుతం మీరు ఈ ఫోన్ ని కేవలం రూ.9,982కే కొనొచ్చు. ఈ ఫోన్లో Android 15 ఓస్, MediaTek 6300 ప్రాసెసర్, 4GB RAM + 128GB స్టోరేజ్, 6.74-అంగుళాల 90Hz IPS LCD డిస్ ప్లే, 50MP + 2MP బ్యాక్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా, 15W ఛార్జింగ్‌తో 6000mAh బ్యాటరీ ఉంది.
వివో T4 లైట్ 5G: ఈ వివో ఫోన్ అమెజాన్‌లో కేవలం రూ.9,999కే లభిస్తుంది. Android 15 ఓస్, MediaTek 6300 ప్రాసెసర్, 4GB RAM + 128GB స్టోరేజ్, 6.74-అంగుళాల 90Hz LCD డిస్ ప్లేతో వస్తుంది. ఈ ఫోన్లో 50MP + 2MP వెనుక కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా, 15W ఛార్జింగ్‌తో 6000mAh బ్యాటరీ ఉంది.
►ALSO READ | కొత్తగా మార్కెట్లోకి హెర్బల్ కోడిగుడ్లు.. వీటి ప్రత్యేకతలు, ప్రయోజనాలు తెలుసుకోండి..
పోకో M7 5G: ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో గొప్ప డిస్కౌంట్ తో వస్తుంది, దీన్ని కేవలం రూ.8,499కి సొంతం చేసుకోవచ్చు. స్నాప్‌డ్రాగన్ 4th జెన్ 2 ప్రాసెసర్, 6GB/8GB RAM + 128GB స్టోరేజ్, 6.88-అంగుళాల 120Hz HD+ డిస్‌ప్లే ఉంది. ఈ ఫోన్లో 50MP వెనుక కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా, 18W ఛార్జింగ్‌తో 5160mAh బ్యాటరీ ఉంది.
శామ్‌సంగ్ గెలాక్సీ M06 5G: ఈ Samsung ఫోన్ Amazonలో కేవలం రూ.7,499కే లభిస్తుంది. MediaTek 6300 ప్రాసెసర్, 4GB/6GB RAM + 128GB స్టోరేజ్, 6.74-అంగుళాల 90Hz HD+ PLS LCD డిస్ ప్లే, 50MP + 2MP బ్యాక్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా, 25W ఛార్జింగ్, 5000mAh బ్యాటరీతో వస్తుంది.
Realme Narzo 80 Lite 5G : ఈ లిస్టులో చివరి ఫోన్ Realme Narzo 80 Lite 5G, ఇది అమెజాన్‌లో కేవలం రూ.9,898కే లభిస్తుంది. ఈ ఫోన్లో MediaTek 6300 ప్రాసెసర్, 4GB RAM + 128GB స్టోరేజ్, 6.67-అంగుళాల 120Hz HD+ డిస్ ప్లే ఉంది. 32MP డ్యూయల్ రియర్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా, 15W ఛార్జింగ్‌తో 6000mAh బ్యాటరీ దీనిలో ఇచ్చారు.
