సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాల్ పేరుతో ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్

సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాల్ పేరుతో  ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్

సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాల్ పేరుతో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఫేక్​ఫేస్‌బుక్‌ అకౌంట్ ను క్రియేట్ చేశారు. ఆ అకౌంట్ నుంచి ప్రజలకు ఫ్రెండ్ రిక్వెస్ట్ లు పంపుతున్న విషయాన్ని గమనించిన సిద్దిపేట సైబర్ క్రైమ్ పోలీసులు సీపీ పేరుతో ఉన్న ఫేక్ అకౌంట్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 

ఆ అకౌంట్ నుంచి వచ్చే పోస్టులు, సమాచారంతో పోలీస్ శాఖకు ఎలాంటి సంబంధం లేదని, వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్​లను అంగీకరించవద్దన్నారు. ఫేక్ అకౌంట్ పై ఇప్పటికే సైబర్ క్రైమ్ విభాగంలో రిపోర్ట్ చేశామని, నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోందని ఆదివారం సీపీ తెలిపారు.