కోహెడ, వెలుగు: ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి సక్సెస్ చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలోని రైతు వేదికలో కలెక్టర్ హైమావతి అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ఈనెల 6 నుంచి జూన్12 వరకు ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 10 ముఖ్య అంశాలపై దృష్టి సారించాలన్నారు. నియోజకవర్గంలోని 7 మండలాల్లో సురభి, ఆర్వీఎం మెడికల్ కాలేజీ ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించేందుకు మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డీఆర్డీవో జయదేవ్, ఏఎంసీ చైర్‌పర్సన్ నిర్మల, ఎంపీడీవో కృష్ణయ్య, వివిద శాఖల అధికారులు, సర్పంచులు పాల్గొన్నారు
