మెదక్, వెలుగు: మెదక్ జిల్లాలో ఓ గిరిజన మహిళ తనకు పుట్టిన మగ శిశువును రూ.50 వేలుకు విక్రయించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై అధికారులు విచారణ ప్రారంభించారు. హవేలీ ఘనపూర్ మండలం లింగాసన్‌పల్లి తండాకు చెందిన గర్భిణి గత నెల 10న మెదక్ పట్టణంలోని ఎంసీహెచ్‌లో మగ బిడ్డకు జన్మనిచ్చింది.
మూడు రోజుల తరువాత డిశ్చార్జ్ కావడంతో స్వగ్రామానికి వెళ్లింది. ఈ నెల 4 నుంచి శిశువు కనిపించకపోవడంతో గ్రామస్తులకు అనుమానం వచ్చింది. ఆ మహిళ, భర్త కలిసి శిశువును రూ.50 వేలుకు గుర్తు తెలియని వ్యక్తికి విక్రయించినట్లు సమాచారం. సోమవారం ఐసీడీఎస్ అధికారులు, పోలీసుల దృష్టికి వెళ్లడంతో విచారణ చేపట్టినట్లు తెలిసింది.
