- ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
జగిత్యాల రూరల్, వెలుగు: ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారని, హత్యా రాజకీయాలు కాదని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పార్టీ ఆఫీస్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి జీవన్‌రెడ్డి వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధమని, సీనియర్ నాయకునిగా ఉండి హింసను ప్రోత్సహించడం సరికాదని అన్నారు. కేవలం ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే అభివృద్ధి జరగదన్నారు.
జీవన్‌రెడ్డి గతంలో టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరలేదా అని ప్రశ్నించారు. విమర్శించేముందు తమ తప్పులను కూడా గుర్తుకుతెచ్చుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ఆయన ఇంటిపార్టీ కాదన్నారు. జగిత్యాల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నిధులు తీసుకురావడాన్ని తట్టుకోలేక బీఆర్‌ఎస్ లీడర్లు తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక తాను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేసిన అంశంపై సుప్రీంకోర్టు, స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు.
