పార్కు కాంపౌండే ఇంటి పునాది

పార్కు కాంపౌండే ఇంటి పునాది
  • చందానగర్​లో కబ్జాదారుల కుట్రను భగ్నం చేసిన హైడ్రా

చందానగర్, వెలుగు: పార్కు స్థలం చుట్టూ జీహెచ్ఎంసీ నిర్మించిన కాంపౌండ్ గోడనే పునాదిగా చేసుకొని ఇల్లు కట్టేందుకు ప్రయత్నిస్తుండగా హైడ్రా అడ్డుకుంది. చందానగర్ భవానీపురంలోని తమ కాలనీలో 400 గజాల పార్కు స్థలం కబ్జాకు గురవుతోందని కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ఇటీవల హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ అధికారులు గ‌‌‌‌‌‌‌‌తంలో పార్కు చుట్టూ ప్రహ‌‌‌‌‌‌‌‌రీ నిర్మించి హ‌‌‌‌‌‌‌‌ద్దులు వేయగా, ఆ ప్రహ‌‌‌‌‌‌‌‌రీనే పునాదులుగా చేసి ఇల్లు క‌‌‌‌‌‌‌‌ట్టడానికి కొందరు ప్రయ‌‌‌‌‌‌‌‌త్నిస్తున్నారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

దీంతో జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ అధికారులతో కలిసి హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. లేఅవుట్ ప్రకారం అది పార్కు స్థలమేనని నిర్ధారించుకొని, మంగళవారం ఆక్రమణలను తొలగించారు. సుమారు రూ.2 కోట్ల రూపాయల విలువైన ఈ స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసి, పార్కు స్థలంగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేశారు.