హైదరాబాద్: ఇజ్రాయెల్-అమెరికా, ఇరాన్ యుద్ధ ప్రభావం హైదరాబాద్ ఐటీ కారిడార్‌పై పడింది. పశ్చిమాసియా ఇంధన సంక్షోభంతో భారత్‌లో ఎల్పీజీ కొరత ఏర్పడటంతో కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ సిలిండర్లపై కోత విధించింది. గ్యాస్ సిలిండర్ల కొరత నేపథ్యంలో హైదరాబాద్ ఐటీ కారిడార్ హాస్టల్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది.
గ్యాస్ సమస్య తీరే వరకు కొన్ని ఆహార పదార్థాలను సర్వ్ చేయొద్దని హాస్టల్ నిర్వాహకులకు సూచించింది. టీ, కాఫీ, చపాతీ, దోశ, పూరి వంటివి పదార్థాలు వడ్డించడం తాత్కాలికంగా ఆపేయాలని చెప్పింది. ఎక్స్‌ట్రా ఫుడ్ ఐటమ్స్ కుక్ చేయకుండా.. బేసిక్ మీల్స్ పెట్టాలని చెప్పింది. హస్టల్ యాజమానులు ప్రత్యామ్నాయ వంట పద్ధతులను పాటించాలని సూచించింది. గ్యాస్ ఆదా చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
ఇజ్రాయెల్, అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ దేశాలపై ఇరాన్ విరుచుకుపడుతుండటంతో మిడిల్ ఈస్ట్ రణరంగంగా మారిన విషయం తెలిసిందే. గల్ఫ్ ప్రధాన ఆర్ధిక వనరైన ఆయిల్ రిఫైనరీలపై ఇరాన్ దాడులు చేస్తోంది. మరోవైపు ప్రపంచ ముడి చమురు రవాణాకు ఎంతో కీలకమైన హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. గల్ఫ్ దేశాలు క్రూడాయిల్ ఉత్పత్తి నిలిపేయడం.. మరోవైపు ఇరాన్ జల సంధి గుండా చమురు రవాణాను ఇరాన్ అడ్డుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఏర్పడింది.
పశ్చిమాసియాలో ఘర్షణలతో గల్ఫ్‌దేశాల నుంచి చమురు, గ్యాస్సరఫరా తగ్గిపోవడంతో భారత్‌లో ఎల్పీజీ కొరత ఏర్పడింది. దీంతో కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరాలో కోతలు పెడ్తున్నది. గృహా అవసరాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. కేంద్ర నిర్ణయంతో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కొరత ప్రభావం హోటల్స్, రెస్టారెంట్లు, హాస్టల్స్‌పై పడింది.
హైదరాబాద్ హోటళ్లపైన ప్రభావం:
ఇరాన్ - ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్ట్ హైదరాబాద్ పైన పడింది. యుద్ధ ప్రభావంతో నగరంలోని హోటల్స్, రెస్టారెంట్స్‌లో గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. ఎల్పీజీ సరఫరా తగ్గడంతో హోటల్స్‌కు కమర్షియల్ గ్యాస్ కొరత ఏర్పడింది. గ్యాస్ ఎఫెక్ట్‌తో మెనూ తగ్గించారు హోటల్స్ నిర్వాహకులు. అధిక గ్యాస్ వినియోగమయ్యే ఆహార పదార్ధాల తయారీని నిలిపివేశారు. వడ, దోష, పూరి బంద్ చేశాయి పలు హోటల్స్. గ్యాస్ కొరతతో హోటల్స్ కూడా త్వరగా బంద్ చేస్తున్నారు నిర్వాహకులు. ఇదే పరిస్థితి ఉంటే హాటల్స్ పూర్తిగా బంద్ చేసుకోవాలి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు హోటల్స్ నిర్వాహకులు.
