హైదరాబాద్, వెలుగు: పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అనర్హత పిటిషన్ లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ బుధవారం తీర్పు ఇవ్వనున్నారు. ఈ ఇద్దరిపై గతవారమే స్పీకర్ విచారణను ముగించి తీర్పును రిజర్వ్ లో ఉంచారు.
ఈ క్రమంలో బుధవారం వెలువడే స్పీకర్ తీర్పు ఎలా ఉండబోతుందో అనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. ఇదే ఆరోపణలపై ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చిన స్పీకర్..దానం, కడియంలపై కూడా తీర్పు అలాగే ఉండనుందా, అందుకు భిన్నంగా రానుందా అనే ఉత్కంఠ కొనసాగుతున్నది.
