తుర్కియేకు ఇరాన్ పౌరుల వలస.. ప్రాణభయంతో సరిహద్దు దాటుతున్న వైనం

తుర్కియేకు ఇరాన్ పౌరుల వలస.. ప్రాణభయంతో సరిహద్దు దాటుతున్న వైనం

టెహ్రాన్: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముదురుతున్న నేపథ్యంలో ప్రాణ భయంతో వందలాది మంది ఇరాన్ పౌరులు బార్డర్ దాటి తుర్కియేకి చేరుకుంటున్నారు. వారం రోజులుగా కొనసాగుతున్న విమాన సర్వీసుల రద్దు, సమాచార వ్యవస్థ నిలిచిపోవడం వంటి సవాళ్లను అధిగమించి తూర్పు తుర్కియేలోని కపికోయ్ బార్డర్ వద్దకు బాధితులు క్యూ కడుతున్నారు. 

తుర్కియేలోని వాన్ ఫ్రావిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరుకున్న తర్వాత వారంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల పరిశ్రమలు మూతపడ్డాయి. అందులో పనిచేసే విదేశీ కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ నేపథ్యంలో వారు బార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దాటుతున్నారు. ఈ సందర్భంగా ఈజిప్టుకు చెందిన మహమ్మద్ ఫౌజీ (46) అనే కార్మికుడు తన గోడును వెళ్లబోసుకున్నారు.

‘‘ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. పనిలేదు. చేతిలో డబ్బుల్లేవు. ఎలాగోలా స్వదేశానికి చేరుకుంటే చాలు’’ అని తెలిపారు. జలీలే జబారీ (63) అనే మహిళ ఇస్తాంబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని తన కుమార్తె వద్దకు బయల్దేరారు.“ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై బాంబులు పడుతుంటే ఎలా ఉండగలను? శాంతి నెలకొంటే తిరిగి వస్తా’’ అని ఆమె చెప్పారు.

ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తిరిగొస్తున్న మరికొందరు

తమ కుటుంబ సభ్యుల కోసం మరికొందరు ఇరాన్‎కు తిరిగి వస్తున్నారు. ఇస్తాంబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పనిచేస్తున్న లైలా (45) తన కుటుంబంతో కాంటాక్ట్ తెగిపోవడంతో తిరిగి షిరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పయనమయ్యారు. ‘‘నా కుటుంబం ప్రమాదంలో ఉంటే నేను ఇక్కడ క్షేమంగా ఎలా ఉండగలను? చనిపోవాల్సి వస్తే అంతా కలిసే పోతం’’ అని అన్నారు.