విజయవాడ-హైదరాబాద్ హైవే పై ట్రాఫిక్ జాంలతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. సంక్రాంతి పండుగ ముగించుకుని హైదరాబాద్ వస్తుండటంతో రద్దీ ఎక్కువయ్యింది. భారీ ట్రాఫిక్ జాం కారణంగా వాహనాలను తప్పించుకుని సైడ్ నుంచి వెళ్తున్న కారు అదుపుతప్పి ఖాళీ స్థలంలోకి దూసుకెళ్లింది.
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట దగ్గర జాతీయ రహదారిపై కార్ పల్టీ కొట్టింది. సంక్రాంతి పండుగ ముగించుకొని విజయవాడ నుంచి హైదరాబాదు వెళ్తుండగా వాహనం ప్రమాదానికి గురైంది. ట్రాఫిక్ అధికంగా ఉండడంతో పక్క నుంచి వెళ్లాలనే ప్రయత్నంలో అదుపుతప్పి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలోకి దూసుకుపోయింది కార్. ఈ ఘటనలో కారులో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు.
పండుగ సెలవులకు వెళ్లిన హైదరాబాదీలు.. సోమవారం (జనవరి 19) వర్కింగ్ డే కావడంతో ఆదివారం సాయంత్రం లోపు సిటీకి చేరుకోవాలని మధ్యాహ్నమే బయల్దేరినా.. ఇంకా ఇళ్లకు చేరుకోలేదు జనాలు. భారీ ట్రాఫిక్ జాం కారణంగా వాహనాలు మెల్లగా సాగుతున్నాయి.
