బస్వాపూర్ నుంచి నీటి విడుదల

బస్వాపూర్ నుంచి నీటి విడుదల

యాదాద్రి, వెలుగు : దశాబ్దకాలం తర్వాత బస్వాపురం(నృసింహ సాగర్​)  రిజర్వాయర్​ నుంచి చెరువులకు సాగు నీరు విడుదలైంది. రిజర్వాయర్​ వద్ద పూజలు చేసిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్​ రెడ్డి   సోమవారం నీరు విడుదల చేసి మాట్లాడారు. గత సర్కారు హయాంలో ఈ రిజర్వాయర్​ను పట్టించుకోలేదన్నారు.

తమ ప్రభుత్వం పవర్​లోకి వచ్చిన తర్వాత భూ సేకరణ ఆటంకాలను తొలగిస్తూ వచ్చామని, పరిహారం కూడా క్రమక్రమంగా అందిస్తున్నామని తెలిపారు. భువనగిరి మీదుగా వెళ్లే నేషనల్​ హైవే కింది నుంచి కాలువ తీయకపోవడంతో ఇప్పటివరకూ నీటి విడుదల ఆలస్యం జరిగిందని చెప్పారు. వీటికి సంబంధించి అన్ని అనుమతులు తీసుకొని పనులు చేయించామని చెప్పారు. మెయిన్​ కాల్వ పూర్తి కావడంతో బస్వాపురం రిజర్వాయర్​ నీటిని విడుదల చేశామన్నారు. భువనగిరి, వలిగొండ మండలాల్లోని చెరువులు నిండుతాయని తెలిపారు.