హైదరాబాద్-విజయవాడ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి.. మరో ఇద్దరికి సీరియస్

హైదరాబాద్-విజయవాడ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి.. మరో ఇద్దరికి సీరియస్

నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నార్కట్‎పల్లి పట్టణ శివారులో హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవేపై ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. 

హైదరాబాద్ నుంచి ఏపీ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నార్కట్‎పల్లి దగ్గర లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో ప్రమాదం జరిగింది. దీంతో వాహనాలను రోడ్డు పక్కకు ఆపి డ్రైవర్లు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఆగివున్న లారీని మరో లారీ వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు స్పా్ట్‎లోనే చనిపోయారు.

మరో ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి సహయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతులను బస్ డ్రైవర్లు శ్రీనివాస్, బంగారయ్యగా గుర్తించారు.

 మృతదేహాలను పోస్ట్‎మార్టం కోసం నల్లగొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. సీఐ నాగరాజు, ఎస్సై  విష్ణు సంఘటన స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలు ఆరా తీశారు. ఈ ఘటనపై నార్కట్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.