- ఎమ్మెల్యే విజయరమణారావు
సుల్తానాబాద్, వెలుగు: సీఎం రేవంత్‌రెడ్డి చొరవతో పెద్దపల్లి నియోజకవర్గంలో అనేక అభివృద్ది పనులు చేపడుతున్నట్టు ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని 10వ వార్డు గాంధీనగర్ గ్రామంలో ఆదివారం ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గులు పోశారు. అనంతరం లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సుల్తానాబాద్ పట్టణంలో రూ.20 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. చెరువు కట్ట కోసం రూ. 8.5కోట్లు కేటాయిస్తామని చెప్పారు.
రాష్ట్రంలో 80 శాతం మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో మంజూరు చేయించుకున్న బస్సు డిపో ఒక మైలురాయి అని అన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్‌రావు, మున్సిపల్ కమిషనర్ రమేశ్, ఓదెల దేవస్థానం డైరెక్టర్ యమున, లీడర్లు పుష్పలత, పల్లా మురళి, దామోదర్ రావు, కృష్ణ, శ్రీగిరి శ్రీనివాస్, సతీశ్, సురేశ్, తదితరులు పాల్గొన్నారు.
