పండుగలకు బ్యానర్లు పెట్టడం కామన్.. దసరా, దీపావళి, సంక్రాంతి వంటి ప్రముఖ పండుగల ప్రత్యేకతను చాటుతూ, మిత్రులకు, బంధువులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు కడుతుంటారు. ఇది యూత్ స్పెషల్ యాక్టివిటీ. అయితే ఈసారి సంక్రాంతి పండుగకు రోటీన్ లా కాకుండా వెరైటీ బ్యానర్లు పెట్టి అందరినీ ఆకట్టుకుంటున్నారు చిత్తూరు జిల్లా కలికిరిపల్లె యూత్.పశువుల పండగ రోజు యువకుల స్పెషల్ బ్యానర్లు ఆ గ్రామంలోనేకాదు.. సోషల్ మీడియాలోకూడా చర్చనీయాంశం అయ్యాయి. ఆ బ్యానర్ కథేంటో చూద్దాం రండి..
అది చిత్తూరు జిల్లా కలికిరి పల్లె గ్రామం.. సంక్రాంతి పండుగ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో ఉంటున్న గ్రామానికి చెందిన చిన్నా పెద్దా అంతా సొంతూరికి చేరుకున్నారు. ఎప్పటిలాగే పండుగ సందర్భంగా గ్రామంలోని వీధులు, కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు యూత్. అయితే గ్రామ నడిబొడ్డున వెలసిన ఓ బ్యానర్ ఎంతగానో ఆకట్టుకుంది. కలికిరిపల్లి యువత క్రియేట్ చేసిన మ్యారేజ్ అడ్వర్టైజ్ బ్యానర్ అందరి దృష్టిని ఆకర్షించింది. పండుగ వేళ నవ్వులు పూయించింది.
కలికిరిపల్లి కనుమ పండుగకు అందరికీ ఇదే మా ఆహ్వానం అంటూ ఆ గ్రామానికి చెందిన యూత్ ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ నెట్టింట వైరల్ అవుతోంది.. ఈ బ్యానర్ లో గ్రామ యువకుల ఫొటోలను డిస్ ప్లే చేశారు. కొంతమంది యువకుల ఫొటోలకు స్టార్ గుర్తులు యాడ్ చేసి ముఖ్య గమనిక అంటూ కోట్ చేశారు.
►ALSO READ | పగిడిద్ద రాజు.. బర్ల గుట్ట నుంచి మేడారానికి వెళ్లేందుకు ఏర్పాట్లు
స్టార్ గుర్తులతో ఉన్న యువకులకు ఇంకా పెళ్లి కాలేదు.. పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు కావాలి అంటూ ముఖ్య గమనికలో రాశారు. పండుల వేళ పెళ్లి ప్రకటనతో యువకుల చేసిన వినూత్న ఆలోచన అందరిదృష్టిని ఆకర్షించింది. స్పెషల్ బ్యానర్లు గ్రామంలో పెద్ద చర్చకు దారి తీశాయి. పశువుల పండుగల రోజు మ్యారేజ్ అడ్వర్టైజ్ బ్యానర్లు నవ్వులు పూయించాయి. బ్యానర్ చూసిన ప్రతి ఒక్కరూ ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. యువకుల వినూత్నమైన హాస్యభరితమైన ప్రయత్నం గ్రామంలో సరదా వాతావరణాన్ని తీసుకొచ్చిందని అభిప్రాయపడ్డారు.
