పెట్టుబడులే టార్గెట్..దావోస్కు సీఎం రేవంత్

పెట్టుబడులే టార్గెట్..దావోస్కు సీఎం రేవంత్

సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు బయల్దేరారు. మేడారంలో సమ్మక్క సారక్కల గద్దెలను పున:ప్రారంభించిన సీఎం..అక్కడి నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చారు. అనంతరం అక్కడి నుంచి దావోస్ కు వెళ్లారు. జనవరి 23 వరకు సీఎం రేవంత్ బృందం దావోస్ లో పర్యటించనుంది. జనవరి 20 నుంచి నాలుగు రోజుల పాటు దావోస్ లో ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొననున్నారు. రేవంత్ తో పాటు మంత్రులు పొంగులేటి,శ్రీధర్ బాబు వెళ్లారు.

 తెలంగాణలో  పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ దావోస్ టూర్ జరగనుంది.  ప్రముఖ కంపెనల సీఈవోలతో సీఎం టీం ప్రత్యేకంగా భేటీ కానున్నారు.  రాష్ట్రంలో పెట్టుబడులు ,పరిశ్రమల విస్తరణ,ఐటీ,ఏఐ, లైఫ్ సైన్సెస్ ,తయారీ రంగాల్లో పెట్టుబడులపై ప్రధానంగా చర్చలు జరపనున్నారు.

దావోస్​ పర్యటనతోపాటు వారం రోజులపాటు ప్రత్యేక సర్టిఫికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోర్సు చేసేందుకు సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి బోస్టన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని హార్వర్డ్​ బిజినెస్​ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్తున్నారు. దీంతో ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు సీఎం విదేశీ పర్యటనలో ఉంటారు.