భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) శతాబ్ది ఉత్సవాల ముగింపు సభ సందర్భంగా ఆదివారం ఖమ్మం నగరం ఎరుపెక్కింది. ఖమ్మం నలుదిక్కులా ఎటు చూసినా రెడ్ షర్ట్ వాలంటీర్ల ప్రదర్శనలు కనిపించాయి. నగరంలోని పెవిలియన్ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన ఈ భారీ ప్రదర్శనలో మూడు వైపుల నుంచి పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఈ ప్రదర్శనలో ముందుభాగంలో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన జనసేవాదళ్ కార్యకర్తల కవాతు ఆకట్టుకోగా, వారి వెనుక కళాకారుల ప్రదర్శనలు సందడి చేశాయి.
బంజారా, కోయ నృత్యాలు, డప్పు దళాల మోత, వృత్తి సంఘాల ప్రదర్శనలతో సభా స్థలి వరకు ర్యాలీ చీమల దండులా సాగింది. పార్టీ శతాబ్ది ఉత్సవాల వేళ నిర్వహించిన ఈ ప్రదర్శన ఎర్రజెండా శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. - వెలుగు ఫొటోగ్రాఫర్, ఖమ్మం
