సిద్దిపేట జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో భార్యగొంతు కోశాడు ఓ కసాయి భర్త. అడ్డొచ్చిన కూతుర్ని కూడా రోకలి బండతో కొట్టాడు. ఈ ఘటన జనవరి 19న జరిగింది.
సిద్దిపేట పట్టణం ఆదర్శ నగర్ లో కుటుంబ కలహాలతో భార్య గొంతు కోశాడు భర్త. అడ్డుగా వచ్చిన కూతురుని రోకలి బండతో కొట్టాడు. ఆ తర్వాత భయంతో గొంతు కోసుకున్నాడు భర్త (ఎల్లయ్య) . భర్త ఎల్లయ్య, కూతురు అర్చన (16)ను ఆసుపత్రికి తరలించారు. తల్లి శ్రీలత (40) మృతి చెందింది.
ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు శ్రీలత మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
