లిడ్ క్యాప్ భూములను పరిరక్షించాలి : రాష్ట్ర అధ్యక్షుడు పల్లెల వీరస్వామి

లిడ్ క్యాప్ భూములను పరిరక్షించాలి : రాష్ట్ర అధ్యక్షుడు పల్లెల వీరస్వామి

జమ్మికుంట, వెలుగు: జమ్మికుంట పట్టణంలోని లిడ్ క్యాప్‌‌‌‌ను పునరుద్ధరించి భూములను పరిరక్షించాలని తెలంగాణ లెదర్ ఆర్టిజన్ కో-ఆపరేటివ్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లెల వీరస్వామి డిమాండ్‌‌‌‌ చేశారు. ఆదివారం జమ్మికుంట పట్టణంలో సొసైటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం నుంచి గాంధీ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. 

ఈ సందర్భంగా వీరస్వామి మాట్లాడుతూ జమ్మికుంట పట్టణంలోని 25 ఎకరాల్లో లెదర్ ఇండస్ట్రీని ప్రారంభించి మాదిగలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్‌‌‌‌ చేశారు. కార్యక్రమంలో లీడర్లు ఆరేపల్లి రాజేందర్, రాజమౌళి, రాజు, రవీందర్, మొగిలి, కొండయ్య, ఓం ప్రకాశ్‌‌‌‌, రాజారాం, సతీశ్‌‌‌‌, తదితరులు పాల్గొన్నారు.