ఆర్బీఐలో 572 ఖాళీ పోస్టులు.. టెన్త్ పాసైతే చాలు.. మిస్సవకండి..

 ఆర్బీఐలో 572 ఖాళీ పోస్టులు.. టెన్త్ పాసైతే చాలు.. మిస్సవకండి..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ ఫిబ్రవరి 04.

ఖాళీలు: 572.

హైదరాబాద్ రిక్రూట్​మెంట్: ​46 (ఎస్సీ 03, ఎస్టీ 03, ఓబీసీ 0, ఈడబ్ల్యూఎస్ 03, అన్​రిజర్వ్డ్ 27, పీడబ్ల్యూబీడీ 03, ఎక్స్ సర్వీస్​మెన్ 07).

ఎలిజిబిలిటీ: అప్లై చేసే రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతం నుంచి పదో తరగతి/ ఎస్ఎస్​సీ/ మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. 2026, జనవరి 01 నాటికి అండర్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. గ్రాడ్యుయేట్లు, ఉన్నత విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అర్హులు కారు.

కావాల్సిన అర్హత: రిక్రూట్‌మెంట్ కార్యాలయానికి అప్లై చేసుకునే అభ్యర్థులు, ఆ కార్యాలయం పరిధిలోకి వచ్చే రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంత  భాషలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. అంటే ఆ భాషను చదవడం, రాయడం, మాట్లాడటం, అర్థం చేసుకోవడం తెలిసి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి ( 2026, జనవరి 01నాటికి)

కనీస వయసు: 18 సంవత్సరాలు.

గరిష్ట వయసు: 25 సంవత్సరాలు. 

మినహాయింపు: షెడ్యూల్డ్ కులాలు / షెడ్యూల్డ్ తెగలకు ఐదేండ్లు, ఇతర వెనుకబడిన తరగతులకు మూడేండ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు అదనంగా 10 ఏండ్లు సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: జనవరి 15.

అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్​మెన్ అభ్యర్థులకు రూ.50. ఇతరులకు రూ.450. 

లాస్ట్ డేట్: ఫిబ్రవరి 04. 

ఆన్​లైన్ టెస్ట్ డేట్( తాత్కాలికం): 2026, ఫిబ్రవరి 28, మార్చి 01. 

సెలెక్షన్ ప్రాసెస్: ఆన్​లైన్ టెస్ట్, లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు  rbi.org.in వెబ్​సైట్​ను సందర్శించండి. 

ఆన్​లైన్ టెస్ట్​
ఆన్​లైన్ టెస్టులో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇస్తారు. రీజనింగ్ 30 ప్రశ్నలు 30 మార్కులకు, జనరల్ ఇంగ్లిష్ 30 ప్రశ్నలు 30 మార్కులకు, జనరల్ అవేర్​నెస్ 30 ప్రశ్నలు 30 మార్కులకు, న్యూమరికల్ ఎబిలిటీ 30 ప్రశ్నలు 30 మార్కులకు అడుగుతారు. మొత్తం 120 ప్రశ్నలు 120 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 90 నిమిషాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పుడు సమాధానానికి 1/4వ వంతు మార్కులు కోత విధిస్తారు. 

అభ్యర్థులు ఆన్‌లైన్ పరీక్షలోని ప్రతి విభాగంలో వేర్వురుగా ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.

లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (ఎల్‌పీటీ)
ఆన్‌లైన్ పరీక్ష ఆధారంగా షార్ట్​లిస్ట్ చేసిన అభ్యర్థులు భాషా ప్రావీణ్య పరీక్ష (ఎల్‌పీటీ)కు హాజరు కావాల్సి ఉంటుంది.ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో సాధించిన మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు. ఈ పరీక్ష సంబంధిత రాష్ట్ర అధికారిక/ స్థానిక భాషల్లో నిర్వహిస్తారు. ఇందులో క్వాలిఫై కాని అభ్యర్థులను అనర్హులుగా ప్రకటిస్తారు.