దళితులను మోసం చేస్తున్న బీజేపీ : రాజేంద్రపాల్ ధ్వజం

దళితులను మోసం చేస్తున్న బీజేపీ : రాజేంద్రపాల్ ధ్వజం
  • ఏఐసీసీ ఎస్సీ సెల్ జాతీయ అధ్యక్షుడు రాజేంద్రపాల్ ధ్వజం
  • చదువుకోలేక చిన్నారులు కూలీ పనులకు వెళ్తున్నారని ఆందోళన

హైదరాబాద్, వెలుగు: కేంద్రంలోని మోదీ సర్కార్ గత 12 ఏళ్లుగా దేశంలోని దళితులను మోసం చేస్తూనే ఉందని ఏఐసీసీ ఎస్సీ సెల్ జాతీయ అధ్యక్షుడు రాజేంద్రపాల్ గౌతమ్ ధ్వజమెత్తారు. కేంద్ర బడ్జెట్ లో విద్యకు కేవలం 2 శాతం నిధులు మాత్రమే కేటాయిస్తూ దళితులు, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు స్కాలర్‌‌‌‌‌‌‌‌షిప్ లు ఇవ్వడం లేదన్నారు. శుక్రవారం గాంధీ భవన్ లో పీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అధ్యక్షతన రాష్ట్ర ఎస్సీ సెల్ సమావేశం నిర్వహించారు.

దీనికి చీఫ్​గెస్ట్​గా హాజరైన జాతీయ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మాట్లాడుతూ.. దేశంలో పేద, మధ్య తరగతి పిల్లలకు ప్రాథమిక, ఉన్నత స్థాయి విద్య ఒక మిథ్యగా మారిందని, ఫలితంగా దేశంలోని చాలా రాష్ట్రాల్లో పిల్లలు కూలీ పనులకు వెళ్తున్నారని  ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 12న గాంధీ భవన్ లో రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్ గా కవ్వంపల్లి సత్యనారాయణ బాధ్యతలు స్వీకరిస్తున్నందున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.