టెన్త్, ఇంటర్ అర్హతతో IICBలో ఉద్యోగాలు: మహిళలకు కూడా ఛాన్స్.. పూర్తి వివరాలు ఇవే!

టెన్త్, ఇంటర్ అర్హతతో  IICBలో ఉద్యోగాలు: మహిళలకు కూడా ఛాన్స్.. పూర్తి వివరాలు ఇవే!

సీఎస్ఐఆర్ - ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ (ఐఐసీబీ) మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పదోతరగతి లేదా ఇంటర్మీడియట్ పూర్తిచేసిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు: 08 (మల్టీ టాస్కింగ్ స్టాఫ్ –- ఎంటీఎస్).

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి, ఇంటర్మీడియట్​లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్​ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. 

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: మార్చి 5

అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మాజీ సైనికులకు, మహిళా అభ్యర్థులకు  ఫీజు మినహాయింపు ఉంటుంది. 

దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 4.

మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ iicb.res.inను సందర్శించండి. 

పరీక్షా విధానం: పరీక్షను ఓఎంఆర్ లేదా కంప్యూటర్ ఆధారిత విధానంలో (సీబీటీ) నిర్వహిస్తారు. ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ రూపంలో, పదో తరగతి స్థాయిలో ఉంటాయి. ప్రతి సరైన సమాధానానికి 3 మార్కులు కేటాయిస్తారు. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉన్నది. ప్రతి తప్పుడు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు.