- కరీంనగర్ అసెంబ్లీ ఇన్‌చార్జి వెలిచాల
కరీంనగర్ సిటీ, వెలుగు: కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ను ఆదరించి గెలిపించాలని ఆ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్ రావు కోరారు. మాజీ కార్పొరేటర్ మీస రమాదేవి ఆధ్వర్యంలో 48 డివిజన్‌లో ఏర్పాటు చేసిన పార్టీ ఆఫీస్‌ను వెలిచాల ఆదివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా డివిజన్‌లో పార్టీ లీడర్లతో కలిసి బస్తీబాట నిర్వహించారు. ఇంటింటా ప్రచారం చేపట్టారు. పార్టీని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ ప్రజలకు సేవ చేయడమే తన ప్రధాన లక్ష్యమన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి, డివిజన్‌ను అభివృద్ధి చేసుకుందామని తెలిపారు.
