సింగరేణి ఆఫీసర్కు ‘నారీ శ్రమశక్తి’ అవార్డు

సింగరేణి ఆఫీసర్కు ‘నారీ శ్రమశక్తి’ అవార్డు

గోదావరిఖని, వెలుగు: సింగరేణి జీడీకే 11వ గనిలో మైన్​ ఇంజినీర్​గా పని చేస్తున్న అల్లం నవ్యశ్రీని నారీ శ్రమశక్తి అవార్డు వరించింది. ఈ నెల 8న కోల్​కత్తాలో జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో మంత్రి జి.కిషన్​ రెడ్డి చేతుల మీదుగా ఆవార్డును అందుకోనున్నారు.

నవ్యశ్రీ గ్రాడ్యుయేట్​ మైనింగ్​ ఇంజినీర్​గా మొదటి షిఫ్ట్​కు ఇన్​చార్జిగా వ్యవహరిస్తూ, 200 మంది కార్మికులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఆమెను ఆర్జీ–1 ఏరియా జీఎం లలిత్​ కుమార్​, అధికారులు అభినందించారు.