సంక్రాంతి కిక్కు..ప్రభుత్వ ఖజానాకు రూ. 877 కోట్ల ఆదాయం

సంక్రాంతి కిక్కు..ప్రభుత్వ ఖజానాకు రూ. 877 కోట్ల ఆదాయం

ఏపీలో సంక్రాంతి పండుగ సందర్భంగా మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డులు సృష్టించాయి. జనవరి 9 నుంచి 16 వరకు, కేవలం వారం రోజుల్లోనే రూ. 877 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది.  ముఖ్యంగా భోగి,సంక్రాంతి,కనుమ రోజు మద్యం ఏరులై పారింది .

సాధారణ రోజుల్లో రోజుకు రూ. 85 కోట్ల అమ్మకాలు జరిగేవి, కానీ పండుగ సీజన్లో ఇవి రెట్టింపు అయ్యాయి. ఎక్సైజ్ శాఖ గణాంకాలు ఈ వివరాలను వెల్లడించాయి.  ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు భారీగా జరిగాయి. 

ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాలు,కృష్ణా,గుంటూరు జిల్లాల్లో కోడి పందేలు ఉండడంతో ఆ ఏరియాలోని వైన్ షాపులకు జనం క్యూ కట్టారు.  రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మద్యం ధరలు పెంచడం కూడా కలిసి వచ్చింది. బాటిల్ పై రూ.10 పెంచుకునేందుకు వెసులు బాటు కల్పించింది

►ALSO READ | టీటీడీ పేరుతో లక్కీ డ్రా స్కామ్.. రూ. 399కే ఫార్చ్యూనర్ కారు అంటూ భక్తులను మోసం.. ముఠా అరెస్ట్..