కొత్తగా మార్కెట్లోకి హెర్బల్ కోడిగుడ్లు.. వీటి ప్రత్యేకతలు, ప్రయోజనాలు తెలుసుకోండి..

కొత్తగా మార్కెట్లోకి హెర్బల్ కోడిగుడ్లు.. వీటి ప్రత్యేకతలు, ప్రయోజనాలు తెలుసుకోండి..

రోజూ పరిమిత మోతాదులో కోడిగుళ్లు తినటం మంచిదని డాక్టర్లు కూడా సూచిస్తుంటారు. అయితే మార్కెట్లో ప్రస్తుతం సాధారణ ఫారమ్ కోడి గుడ్ల నుంచి రకరకాల ఎగ్స్ వచ్చేశాయి. దీంతో వినియోగదారుల్లో కూడా కొంత గందరగోళం ఉంది. మెున్నటి వరకు ఫ్రీ రేంజ్ ఎగ్స్, హై ప్రొటీన్ ఎగ్స్, విటమిన్ డి ఎగ్స్, ఒమేగా 3 ఎగ్స్, కార్న్ ఫెడ్ ఎగ్స్, ఆర్గానిక్ ఎగ్స్ అంటూ మార్కెట్లోకి అనేక రకాల కోడిగుడ్లు వచ్చాయి. అయితే ఇప్పుడు వీటన్నింటినీ మించి హెర్బల్ ఎగ్స్ ట్రెండింగ్ అవుతున్నాయి. అసలు ఏంటి ఈ హెర్బల్ ఎగ్స్, మిగిలిన వాటితో ఉండే తేడాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం....

భోపాల్ విమానాశ్రయానికి చేరువలో ఉన్న ఆదిత్య గుప్తా పౌల్ట్రీ ఫార్మ్ సరికొత్త హెర్బల్ ఎగ్స్ ఉత్పత్తిలో ఉంది. ఈ సంస్థ తమ కోళ్లకు దాణాలో తులసి, పసులు, అష్వగంధ, పార్స్లీ, స్పిరులినా, సేజ్, పుదీనా వంటి దాదాపు 250 వివిధ మూలికలను ఆహారంలో అందిస్తోంది. వీరు కోళ్లకు అందిస్తున్న ఆహారాన్ని పేటెంట్ కూడా పొందారు. ఈ సంస్థ తమ గుడ్లు మామూలు వాటిలా వాసన రావని చెబుతోంది. 

పైగా కోళ్లకు వనమూలికలతో ఉన్న ఆహారం అందించటం వల్ల గుడ్లలోని పోషకాలు పెరుగుతున్నట్లు చెబుతోంది. ప్రస్తుతం ఈ సంస్థ తన ఎగ్స్ అండ్ ఎగ్స్ బ్రాండ్ కింద హెర్బల్ గుడ్లను కేవలం భోపాల్ ప్రాంతంలోనే అమ్ముతోంది. సోషల్ మీడియా వల్ల వచ్చిన ప్రచారం, కస్టమర్ల ఫీడ్ బ్యాక్ కారణంగా కంపెనీ మంచి వ-ృద్ధిని చూస్తోంది. దీనిపై కస్టమర్లు కూడా తమ అనుభవాలను పంచుకుంటున్నారు. 

►ALSO READ | విశాఖలో గూగుల్ AI లక్షా 30 వేల కోట్ల పెట్టుబడి : మోడీకి ప్లాన్స్ వివరించిన సుందర్ పిచాయ్

భోపాల్ ప్రాంతంలో మాజీ ఆర్మీ అధికారి శైలేంద్ర సింగ్ తాను స్టెరాయిడ్స్ తో కూడిన చికిత్స తీసుకున్న సమయంలో 25 కేజీలు బరువు తగ్గానని, ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉండటంతో రికవరీకి 2 ఏళ్లు టైమ్ పడుతుందని వైద్యులు చెప్పారన్నారు. అయితే తాను ఈ హెర్బల్ ఎగ్స్ వాడాక కేవలం 6 నెలల్లోనే కోలుకున్నట్లు చెప్పుకొచ్చారు. మరో యూజర్ తాను జీవితాతం గుడ్ల వాసన వల్ల దూరం పెట్టేవాడినని కానీ హెర్బల్ ఎగ్స్ కారణంగా రోజూ క్రమం తప్పకుండా వాటిని తింటున్నానని వెల్లడించారు. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న వివిధ కోడి గుడ్లు ఒక్కోటి రూ.9 నుంచి ఏకంగా రూ.26 వరకు అమ్మేస్తున్నాయి పౌల్ట్రీ సంస్థలు.