మార్చి 24–27 తేదీల్లో సాయి పేరెంటరల్స్ ఐపీఓ

మార్చి 24–27 తేదీల్లో సాయి పేరెంటరల్స్ ఐపీఓ

హైదరాబాద్​, వెలుగు: ఫార్మాస్యూటికల్ ఫార్ములేషన్ కంపెనీ సాయి పేరెంటరల్స్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 24–27 తేదీల్లో జరుగుతుంది. ఐపీఓ ద్వారా రూ.285 కోట్లు సమీకరించాలని ఈ హైదరాబాద్​ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇష్యూ ద్వారా 31,57,880 షేర్లను విక్రయించనుంది.

ప్రైస్​ బ్యాండ్​ను రూ.372–రూ.392 మధ్య నిర్ణయించింది. సమీకరించిన నిధులను అంతర్జాతీయ ఫార్మా వ్యాపారం విస్తరణకు, తయారీ కేంద్రాల బలోపేతానికి ఉపయోగిస్తామని కంపెనీ ఎండీ, సీఈఓ అనిల్ అన్నారు. ఆస్ట్రేలియాకు చెందిన నౌమెడ్ ఫార్మాస్యూటికల్స్ కొనుగోలు చేయడం ద్వారా అంతర్జాతీయ మార్కెట్లలో విస్తరించామని తెలిపారు. కంపెనీ షేర్లు ఈ నెల 31న బీఎస్​ఈ, ఎన్​ఎస్​ఈలో లిస్టయ్యే అవకాశం ఉంది.