విశాఖలో గూగుల్ AI లక్షా 30 వేల కోట్ల పెట్టుబడి : మోడీకి ప్లాన్స్ వివరించిన సుందర్ పిచాయ్

విశాఖలో గూగుల్ AI లక్షా 30 వేల కోట్ల పెట్టుబడి : మోడీకి ప్లాన్స్ వివరించిన సుందర్ పిచాయ్

అమెరికా టెక్ దిగ్గజం గూగుల్ మారుతున్న ఏఐ యుగానికి అనుగుణంగా కొత్త ప్రాజెక్టులను తీసుకొస్తోంది. ఇందులో భాగంగా కంపెనీ ఇండియాలో అతిపెద్ద పెట్టుబడికి సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ కేంద్రంగా ఏఐ భవిష్యత్తు కోసం 15 బిలియన్ డాలర్లను రానున్న 5 ఏళ్లలో పెట్టుబడిగా పెడుతున్నట్లు కంపెనీ కన్ఫమ్ చేసింది. భారత కరెన్సీ లెక్కల ప్రకారం ఈ పెట్టుబడి విలువ రూ.లక్షా 30వేల వరకు ఉంటుందని తేలింది. 

ప్రస్తుతం భారతదేశంలో పర్యటిస్తున్న గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రధాని మోడీని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో కంపెనీ కంపెనీ చేపట్టిన ఏఐ పెట్టుబడుల గురించి వివరించారు. ఈ ప్రాజెక్ట్ కేవలం మరో పెట్టుబడి ప్రాజెక్ట్ కాదు.. పిచాయ్ స్వదేశానికి తిరిగి ఇచ్చే మార్గంలో ఒక విప్లవాత్మక మెట్టుగా చెప్పుకోవచ్చు. రానున్న కాలంలో భారత ఏఐ రాజధానిగా వైజాగ్ మారబోతున్నట్లు పిచాయ్ వెల్లడించారు.  

విశాఖలో ఏర్పాటు చేస్తున్న కొత్త గూగుల్ AI హబ్‌లో ఒక గిగావాట్ డేటా సెంటర్ మాత్రమే కాకుండా.. స్మార్ట్ ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇంటర్నేషనల్ సబ్‌సీ గేట్‌వే, ఒక విస్తృత ఫైబర్ నెట్‌వర్క్ ఉంటాయని పిచాయ్ చెప్పారు. ఇవన్నీ చూస్తుంటే ఇది ప్రపంచంలో అమెరికా బయట గూగుల్ చేపట్టిన అతిపెద్ద AI హబ్ అవుతుందని తెలుస్తోంది. భారతదేశంలో కొనసాగుతున్న ఏఐ ఆవిష్కరణలు, వృద్ధికి తమ సాంకేతికత దోహదపడుతుందని పిచాయ్ అన్నారు. 

►ALSO READ | EMailకు ఇండియా గుడ్ బై చెబుతోందా: ప్రధాని మోడీతో సహా 12 లక్షల మెయిల్స్ Zohoకు మార్పు..

‘AI City Vizag’ ప్రణాళిక ద్వారా రాబోయే ఐదు సంవత్సరాల్లో సుమారు లక్షా 80వేల ఉద్యోగాలు సృష్టి జరగనున్నట్లు వెల్లడైంది. ఈ ప్రాజెక్ట్ స్థానిక ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌కు బలాన్నిస్తూ, ఆంధ్రప్రదేశ్‌ను భారత సరికొత్త AI అభివృద్ధి కేంద్రంగా నిలబెట్టబోతోందని తెలుస్తోంది. గూగుల్ చేస్తున్న ఈ భారీ పెట్టుబడి ప్రస్తుత ఏఐ అవసరాలను తీర్చటంలో కొత్త దిశకు అడుగులుగా తెలుస్తోంది. దేశంలోని యువ టెక్కీలకు ఇదొక మెగా జాబ్ అవకాశాల గనిగా మారనుందని నిపుణులు చెబుతున్నారు.