గచ్చిబౌలి, వెలుగు: నటి రేణుదేశాయ్‌పై సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్స్ చేసిన వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మాదాపూర్‌లోని ఓ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న కోటిపల్లి వెంకన్న ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూస్తుండగా.. రేణుదేశాయ్ వీడియో వచ్చింది.
ఆ వీడియోపై వెంకన్న అసభ్యకరమైన కామెంట్స్ చేశాడు. ఈ కామెంట్స్‌పై రేణుదేశాయ్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని మంగళవారం మాదాపూర్‌లో వెంకన్నను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
