ఖమ్మం అర్బన్ మండలంలోని దోచుకున్న సొమ్ము తిరిగి బాధితులకు అప్పగింత : ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి

ఖమ్మం అర్బన్ మండలంలోని దోచుకున్న సొమ్ము తిరిగి బాధితులకు అప్పగింత : ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి

ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం అర్బన్ మండలంలోని వెలుగుమట్ల భూదాన్ భూమి కొనుగోలులో ఓపీడీఆర్, యూసీసీ ఆర్ఐఎంఎల్ పార్టీల పేరుతో నాయకుల చేతిలో మోసపోయిన 9 మంది బాధితులకు మంగళవారం ఒక్కొక్కరికీ రూ.3.5 లక్షల చొప్పున రూ.14 లక్షలు ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి అందజేశారు. ఇప్పటికే భూదాన్ భూమి పేరుతో అక్రమ వ్యాపారాలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. 

ఖమ్మం ఖానాపురం హావేలి పోలీసుల సహకారంతో భూదాన్ వినోభాభావే వెల్ఫేర్ సొసైటీ పేరుతో పోలేబొయిన ముత్తయ్య ప్రజలను మోసం చేసినట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన మూడు బ్యాంకు అకౌంట్ల ను హోల్డ్ చేశామని, దోచుకున్న డబ్బులను ఆయా బ్యాంకు అకౌంట్ల నుంచి లావాదేవీలు చేసినట్లు గుర్తించామన్నారు. మోసపోయిన చిర్రా చంద్రకళ, గీతాంజలి, పుల్లమ్మ, పాపయ్య తదితరులకు ఏసీపీ డబ్బులు అందజేశారు.