EMailకు ఇండియా గుడ్ బై చెబుతోందా: ప్రధాని మోడీతో సహా 12 లక్షల మెయిల్స్ Zohoకు మార్పు..

 EMailకు ఇండియా గుడ్ బై చెబుతోందా: ప్రధాని మోడీతో సహా 12 లక్షల మెయిల్స్ Zohoకు మార్పు..

భారతదేశ టెక్నాలజీని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ప్రధానమంత్రి ఆఫీసు(PMO)తో సహా 12 లక్షల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగుల ఇమెయిల్ అకౌంట్లను 'జోహో కార్పొరేషన్'కి మార్చింది. గతంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉపయోగించిన నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) వ్యవస్థ నుండి ఇప్పుడు జోహో అభివృద్ధి చేసిన ప్లాట్‌ఫామ్‌కు మార్చింది. అంతేకాకుండా, ఉద్యోగులు ఇకపై ప్రెజెంటేషన్లు, వర్డ్ ఫైళ్లు, స్ప్రెడ్‌షీట్‌ల కోసం ఓపెన్ సోర్స్ అప్లికేషన్లను వాడకుండా జోహో ఆఫీస్ సూట్‌ ఉపయోగించేలా ఏర్పాటు చేశారు.

చెన్నైకి చెందిన జోహోకు 2023లో ఏడేళ్ల కాంట్రాక్టు ఇచ్చారు. ఈ మార్పులో భాగంగా డేటా స్టోరేజ్, ప్రాసెసింగ్ NIC నుండి జోహోకు మారింది. అఫీషియల్ ఇమెయిల్స్ కోసం ఉద్యోగులు పాత '.nic.in' అండ్ '.gov.in' డొమైన్‌లనే కొనసాగిస్తారు. 2022లో ఢిల్లీలోని AIIMS పై జరిగిన సైబర్ దాడి తర్వాత ఓపెన్-సోర్స్ టూల్స్‌పై ఆధారపడటం వల్ల భద్రతా సమస్యలు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో కొత్త ప్రొవైడర్, స్వదేశీ టెక్నాలజీకి సహకారం ఇవ్వడం వేగమైంది. డాకుమెంట్స్, స్ప్రెడ్‌షీట్‌ల కోసం ఆన్ సేఫ్(UNSAFE)  ఓపెన్-సోర్స్ యాప్స్ ఉపయోగించడం వల్ల వచ్చే సమస్యలు దీని  వల్ల  తొలగుతాయి.  

సాఫ్ట్‌వేర్ క్వాలిటీ సిస్టమ్స్ ద్వారా ఎప్పటికప్పుడు ఆడిట్‌లు, NIC & CERT-In నుండి అనుమతి వంటి భద్రతా చర్యలు తీసుకున్నారు. ఇవి డేటా సెక్యూరిటీకి హామీ ఇస్తాయి. జోహో ఫౌండర్  శ్రీధర్ వెంబు మాట్లాడుతూ కస్టమర్ డేటాను మేము చూడము,  అమ్మెందుకు ఉపయోగించము అనే నమ్మకంపైనే మా వ్యాపారం ఆధారపడి ఉందని, అలాగే ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ అనేది టెక్నాలజీ ఫీచర్, అది  కూడా త్వరలో వస్తుందిని  తెలిపారు.

హోంమంత్రి అమిత్ షాతో సహా చాలా మంది కేంద్ర మంత్రులు పర్సనల్ ఇమెయిల్‌ల కోసం జోహో ఉపయోగిస్తున్నారు. అయితే, అఫీషియల్ ఆర్డర్స్ మాత్రం ప్రభుత్వ డొమైన్‌లోనే జరుగుతాయి. విద్యా మంత్రిత్వ శాఖ  కూడా అన్ని విభాగాల్లో జోహో టూల్స్ తప్పనిసరిగా ప్రోత్సహించాలని పేర్కొన్నారు. జోహో  మెసేజింగ్ యాప్‌ అరట్టై ప్రజాదరణ పొందుతున్న కొద్దీ, ప్రభుత్వ ఈ నిర్ణయం ప్రైవేట్ రంగంలో కూడా దీని వాడకాన్ని పెంచే అవకాశం ఉంది.