అద్భుతం పాల్వంచ శ్రీనివాసకాలనీ శ్రీనివాసగిరి గుట్ట వెంకన్న రథోత్సవం

అద్భుతం పాల్వంచ శ్రీనివాసకాలనీ శ్రీనివాసగిరి  గుట్ట వెంకన్న రథోత్సవం

పాల్వంచ, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచ శ్రీనివాసకాలనీ శ్రీనివాసగిరి వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరిరోజు మంగళవారం రథోత్సవం కనుల పండువగా సాగింది. పాదాల మండపం వద్ద రథానికి ఆలయ ట్రస్ట్ బోర్డు అధ్యక్ష, కార్యదర్శులు కొత్త వెంకటేశ్వర్లు, ఆరుట్ల లక్ష్మణాచార్యు లు, భక్త సమాజ మండలి అధ్యక్ష, కార్యదర్శులు ఊకే భద్రయ్య, తాటికొండ శ్రీలత, ఆలయ ప్రధానార్చకులు నగేశ్​ కుమార్ శర్మ, ఫణి రాజాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించగా, 5 కిలో మీటర్ల పొడవున మహిళా భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ రథం లాగారు. 

ప్రారంభ జెండాను ఆలయ గౌరవసలహాదారులు నరసింహ కుమార్, అధ్యక్షుడు సుధాకర్ స్వామివారి జెండా ఊపారు. కార్యక్రమంలో కేరళ సాంప్రదాయ సింగారి వాయిద్యం భక్తులను ఆకట్టుకుంది. బేరాశ్రీలక్ష్మి కోలాట నృత్యం విశేషంగా అలరించింది.