
యూట్యూబ్ వీడియోలతో కామెడీ పండించి, కోవిడ్ లాక్‌డౌన్‌లో తెలుగు ప్రేక్షకులకు నవ్వులు పంచిన మౌళి తనూజ్, ఇప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ యంగ్ హీరోగా మారారు. ఒకప్పుడు డిజిటల్ స్క్రీన్‌పై అలరించిన ఈ యువ నటుడు, ఇప్పుడు వెండితెరపై సంచలనం సృష్టిస్తున్నాడు. యూట్యూబ్ తర్వాత, 'హ్యాష్ ట్యాగ్ 90ఎస్' వెబ్ సిరీస్‌లో తనూజ్ పోషించిన 'యూత్ బఠాణీ' పాత్ర అతనికి అద్భుతమైన గుర్తింపు తెచ్చిపెట్టింది. తన సహజమైన కామెడీ టైమింగ్, చిలిపి డైలాగ్ డెలివరీతో యూత్‌లో ఇన్‌స్టంట్ స్టార్‌డమ్ సంపాదించుకున్నాడు.
'లిటిల్ హార్ట్స్'తో ఊహించని మెగా హిట్
అయితే, మౌళి తనూజ్ కెరీర్‌ను ఒక్కసారిగా మలుపు తిప్పింది ఇటీవల విడుదలైన 'లిటిల్ హార్ట్స్' చిత్రం. కేవలం చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, బాక్సాఫీస్ వద్ద రూ.40 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. మౌళి తనూజ్ నటన, ముఖ్యంగా ఎమోషనల్ సీన్లలో అతని పరిణతి ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ ఊహించని మెగా హిట్ అతని మార్కెట్‌ను పెంచింది. ఒక్క సినిమాతో అతను మీడియం రేంజ్ హీరోల జాబితాలో చేరిపోయాడు. ప్రస్తుతం కొత్త దర్శకులతో పాటు పెద్ద నిర్మాణ సంస్థలు కూడా ఆయనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
►ALSO READ | తమన్నాపై అణ్ణు కపూర్ నోటి దురుసు.. బాడీ షేమింగ్ వ్యాఖ్యలపై నెటిజన్లు సీరియస్!
జాక్‌పాట్!
లేటెస్ట్ గా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తమ తదుపరి ప్రాజెక్ట్ కోసం తనూజ్ మౌళికి ఏకంగా భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. కేవలం ఒక్క గ్రాండ్ హిట్‌తో ఈ స్థాయి పాపులారిటీ, మార్కెట్ అందుకోవడం నిజంగా టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. నిజానికి, పరిశ్రమలో ఇదొక ట్రెండ్. నిర్మాతలు ఒక నటుడిపై, అతని కథా ఎంపికపై నమ్మకం కుదిరిన తర్వాతే భారీ పారితోషికాలు ఇవ్వడానికి వెనుకాడరు. 'లిటిల్ హార్ట్స్' సక్సెస్‌తో తనుజ్ కేవలం నటుడిగానే కాక, కలెక్షన్లు రాబట్టగల హీరోగా నిరూపించుకున్నాడు. అందుకే, నెట్టింట అంతా... 'లిటిల్ హార్ట్స్' హీరో జాక్‌పాట్ కొట్టేశాడు అంటూ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. యూట్యూబ్ నుంచి మొదలైన ప్రయాణం.. ఇప్పుడు రూ. 40 కోట్ల హీరోగా తనూజ్ జర్నీ మారిపోందంటూ కామెంట్లు చేస్తున్నారు.