
- 40 పేజీలతో సుప్రీంలో ఎస్ఎల్పీ
- న్యాయం జరుగుతుందనే నమ్మకముంది
ఢిల్లీ: అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయిస్తూ చేసిన తీర్మానానికి బీజేపీ, బీఆర్ఎ స్ మద్దతు ఇచ్చి ఇప్పుడు మాట మార్చాయని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఇవాళ ఢిల్లీలో సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింగ్వీతో భేటీ అయ్యారు. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై చర్చిం చారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ 40 పేజీలతో కూడిన ఎస్ఎల్పీ దాఖలు చేసినట్టు చెప్పారు. హైకోర్టు జీవో నంబర్ 9 పై విధించిన స్టే ఎత్తి వేయాలని కోరినట్టు చెప్పారు. తెలంగాణలో అత్యంత శాస్త్రీయంగా నిర్వహించిన కుల గణన అంశాలను పిటిషన్ లో నివేదించామన్నారు.సు ప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందని మహేశ్ గౌడ్ చెప్పారు.